బుద్ధుందా…స‌మంత సీరియ‌స్‌

ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌-స‌మంత జంట సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. ఇందుకు కార‌ణాలేంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ జంట విడాకుల బాట న‌డుస్తోంద‌నే వార్త‌లు మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వారిని…

ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌-స‌మంత జంట సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. ఇందుకు కార‌ణాలేంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ జంట విడాకుల బాట న‌డుస్తోంద‌నే వార్త‌లు మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వారిని ఆమె ఒంట‌రిగా ద‌ర్శించుకోవ‌డం… విడాకుల ప్ర‌చారానికి బ‌లం క‌లిగించింది.

ఈ క్ర‌మంలో మీడియా ప్ర‌తినిధుల‌పై ఆమె విరుచుకుప‌డ‌డం …విడాకుల ప్ర‌చార‌మే కార‌ణ‌మై ఉంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వీఐపీ బ్రేక్ ప్రారంభంలో శ్రీ‌వారిని స‌మంత ద‌ర్శించుకున్నారు. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌ప‌లంలో వేద‌పండితుల ఆశీర్వ‌చ‌నం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంలో ఓ ఫొటో తీసుకుంటామ‌ని స‌మంత‌ను  జ‌ర్న‌లిస్టులు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా అడ‌గ‌డం ఆమెకు కోపం తెప్పించింది.

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ  పాత్రికేయులపై హీరోయిన్ సమంత సీరియస్ అయ్యారు. దీంతో జ‌ర్న‌లిస్టులు షాక్‌కు గుర‌య్యారు. తిరుమ‌ల‌కు వ‌చ్చే సినీ, పొలిటిక‌ల్ సెల‌బ్రిటీల‌ను మీడియా ప్ర‌తినిధులు ప‌ల‌క‌రించ‌డం, వారి అభిప్రాయాలు తెలుసుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రుగుతోంటోంది. 

ఈ నేప‌థ్యంలో స‌మంతను కూడా మీడియా ప్ర‌తినిధులు ఆ ఉద్దేశంతోనే ప‌ల‌క‌రించారు. ఫొటో కావాల‌ని అడిగారు. దీనికి ఆమె ప్ర‌తిస్పంద‌న‌గా జ‌ర్న‌లిస్టుల బుద్ధి గురించి ప‌రుషంగా మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం, ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ఎవ‌రి మీదో కోపాన్ని, మ‌రెవ‌రి మీదో ఆమె చూపుతున్నార‌ని మీడియా ప్ర‌తినిధులు వాపోతున్నారు.