దేవుడున్నాడని మంచు మనోజ్‌కు బలమైన నమ్మకం కలగడం వెనుక కారణం ఏంటి? ఆ విషయం తెలుసుకోవాలంటే మనోజ్ ట్వీట్ ఏంటో చూడాలి. మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో మంచు మనోజ్ ట్వీట్ ముడిపడి ఉంది. దీనంతటికి కామాంధుడు రాజు ఇవాళ్టి ఆత్మహత్యే కారణమైంది.
ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై సైదాబాద్ కీచకుడు రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై అతని భార్య మౌనిక పేరున్న పచ్చబొట్టు ద్వారా ఆ వ్యక్తి అత్యాచార నిందితుడిని గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కామంధుడి ఆత్మహత్యపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.
చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. నిందితుడు రాజు మృతదేహం స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేట్రాక్‌పై ఉన్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తనకు సమాచారం ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్‌కు మంచు మనోజ్ రీట్వీట్ చేశారు. ‘ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ సర్.. దేవుడు ఉన్నాడు’ అంటూ మంచు మనోజ్ తెలిపారు.
రెండురోజుల క్రితం మంచు మనోజ్ బాధిత చిన్నారి ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చిన సంగతి తెలిసిందే. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో పాటు కోట్లాది మంది ప్రజలు కోరుకున్నట్టుగానే… కామాంధుడు తనకు తానుగా మరణదండన వేసుకోవడాన్ని, దేవుడు విధించిన శిక్షగా మంచు మనోజ్ ట్వీట్ ప్రతిబింబించింది. ఇదే విషయాన్ని ఆయన అభిమానులు కూడా చెబుతున్నారు.