కాపాడాల్సిన పోలీసే కీచకుడిగా మారాడు. ఏకంగా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలో జరిగింది ఈ ఘటన.. అమ్మాయి ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో బయటపడింది.
బుక్కరాయసముద్రంలో ఇద్దరు వ్యక్తులు ఓ ప్రేమికుల జంటను అటకాయించారు. తాము పోలీసులమని బెదిరించారు. ప్రేమికుల జంటపై అమానుషంగా ప్రవర్తించారు. మీపై అనుమానంగా ఉంది, ఎంక్వయిరీ చేయాలంటూ వాళ్లను లాక్కెళ్లారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత అమ్మాయి ప్రియుడు నవీన్ పై విచక్షణారహితంగా దాడిచేశారు. అతడ్ని కొట్టి పొదల్లో పడేసి, యువతిని కిడ్నాప్ చేశారు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కోలుకున్న నవీన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు యువతిని రక్షించడంతో పాటు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. చూస్తే.. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకడ్ని కానిస్టేబుల్ సురేంద్రగా గుర్తించారు. అతడు తన ఫ్రెండ్ రాజశేఖర్ తో కలిసి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు. డిపార్ట్ మెంట్ లో ఉండి ఇలా కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.