వాదనాపటిమగల న్యాయవాది ఒకాయనున్నాడు. ఆయన మాట్లాడుతుంటే లాజిక్కుంటుంది, డెప్త్ ఉంటుంది, విషయముంటుంది, అర్థవంతమైన ఆవేశముంటుంది, వినోదముంటుంది…ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కల్యాణ్ దగ్గర లేని ఉత్తమలక్షణాలన్నీ ఇతని స్పీచుల్లో ఉంటాయి.
కొన్నాళ్లు జనసేన పక్షాన ఉండి ఎందుకో తప్పుకున్నాడు. తప్పుకున్నా కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా బలహీనుల పక్షాన నిలబడ్డాడు. ఒకానొక బార్బర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి ఒక సినీ కుటుంబానికి చెందిన వ్యక్తికి మధ్య వివాదమైతే ఈ న్యాయవాది ఆ బార్బర్ పక్షాన నిలబడి తన సత్తా చాటుకున్నాడు. దీనిపై తన యూట్యూబ్ చానల్లో వీడియోలు కూడా పెట్టాడు.
అంతలోనే ఏమయ్యిందో తెలీదు. సడెన్ గా ఆ టాపిక్ వదిలేసాడు. కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అనిపించేది ఒక్కటే. అతను డబ్బుకిగానీ, భయానికి గానీ లొంగి ఉండాలని. లేకపోతే సడెన్ గా అసలా టాపిక్కునే వదిలేయడమెందుకు?
అదలా ఉంచితే తాజాగా ఇతను మళ్లీ జనసేన పక్షాన ఉంటున్నాడు. మళ్లీ అనుమానాలొస్తున్నాయి. తెదేపా, జనసేనలు కలిసి ఇతన్ని బతిమిలాడో, డబ్బిచ్చో తమ పక్షాన నిలబడమని ఉండొచ్చు. లేకపోతే ఈ విజ్ఞతగల న్యాయవాది అజ్ఞానవాది అయిన జనసేనాని కి వకల్తా పుచ్చుకుని మాట్లాడి తన ఇమేజ్ ని పణంగా పెట్టాల్సిన పని లేదు కదా.
ఒకానొక పత్రికా యజమానిని, అతని కులవర్గాన్ని తన వీడియోలతో ఒక ఆట ఆడుకుని వాళ్లచేత పొలికేక పెట్టించిన ఈ వకీలు ఇప్పుడు ఆ దిశగా ఏ వీడియో చెయ్యట్లేదు. పూర్తిగా ట్రాక్ మార్చేసాడు.
దేన్నైనా నమ్మితే అదే భావజాలాన్ని, అదే పోరాట పటిమని నిరంతరం చూపించాలి. అంతే కానీ డబ్బుకో, భయానికో తలవంచి ట్రాకుమారిస్తే విలువెందుకుంటుంది.