మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ అంటే హెవీయెస్ట్ వెంచర్ సైరా. చిరంజీవి ప్రస్థానంలోనే అత్యంత భారీ సినిమా. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సినిమా. ఈ సినిమాకు అంతకు మించి మరో స్పెషాలిటీ వుంది. ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి కెరీర్ లో ఒక కొత్త రికార్డు వస్తుంది. అదెలా అంటే..
చిరంజీవి 2002లో ఇంద్ర సినిమా వచ్చింది. ఆ సినిమా స్ట్రయిట్ సినిమా వచ్చింది. ఆ తరువాత టాగోర్ రీమేక్ హిట్. ఆ తరువాత అంజి స్ట్రయిట్ సినిమా ఫ్లాప్. తరువాత శంకర్ దాదా రీమేక్, హిట్. ఆ పైన అందరివాడు, జై చిరంజీవ ఫ్లాపులు. స్టాలిన్ యావరేజ్. ఈ మూడూ స్ట్రెయిట్ సినిమాలు.
2017లో ఖైదీ నెంబర్ 150 పెద్ద హిట్. కానీ రీమేక్. ఆ తరువాత సైరా నరసింహా రెడ్డి. మళ్లీ స్ట్రయిట్ సినిమా. ఈ సినిమాకు మాంచి బజ్ వుంది. అభిమానులకే కాదు, సినిమా లవర్స్ కూ బోలెడు ఆశలు వున్నాయి. అందువల్ల ఇది హిట్ అయితే దాదాపు 17 ఏళ్ల తరువాత చిరంజీవి స్ట్రయిట్ సినిమాతో హిట్ కొట్టినట్లు అవుతుంది. అదీ లెక్క.