సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా వ్యవహారం కొలిక్కి వచ్చేసింది. నాలుగు రోజుల పాటు త్రివిక్రమ్-మహేష్ ల రెగ్యులర్ సిటింగ్ ల నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాలు పక్కాగా ఫైనల్ అయ్యాయి.
ఇరువైపులా డిస్కషన్ల నేపథ్యంలో ఇరు వైపులా పలు సందేహాలకు క్లారిటీ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ఇక సెట్ మీదకు రెండో షెడ్యూలు వెళ్లడం బకాయి. అయితే వివిధ లాంగ్వేజ్ నటుల డేట్ లు కావాల్సి రావడం వల్ల ప్లానింగ్ కొంచెం ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
నవంబర్ మూడో వారం నుంచి మహేష్-త్రివిక్రమ్ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా మ్యూజిక్ వర్క్ ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. థమన్ సంక్రాంతి సినిమాల మీద బిజీగా వున్నారు. ఆ వర్క్ పూర్తి కాగానే ఈ సినిమా మీదకు వస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ కు లోకల్ గానే చిన్న చిన్న పర్సనల్ పనులు వున్నాయని, అవి ఫినిష్ చేసుకుంటారని తెలుస్తోంది. మూడో వారం నుంచి షెడ్యూలు స్టార్ట్ చేస్తే, ఇక నాన్ స్టాప్ గానే ముందుకు వెళ్తుందని బోగట్టా. మొత్తం మీద గత రెండు వారాల నుంచి నడిచిన మహేష్-త్రివిక్రమ్ సినిమా వ్యవహారం టీ కప్పులో తుపానుగా ముగిసిపోయిందనుకోవాలి.