సొంతంగానే బీజేపీ… జనసేన ఊసే లేదుగా…

విశాఖలో ప్రధాని మోడీ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పర్యటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపుగా పదివేల కోట్ల రూపాయల విలువ చేసే అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. మోడీ టూర్ ని…

విశాఖలో ప్రధాని మోడీ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పర్యటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపుగా పదివేల కోట్ల రూపాయల విలువ చేసే అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. మోడీ టూర్ ని పొలిటికల్ గా హైలెట్ చేసి తన మైలేజ్ పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహా కీలక నేతలు విశాఖలో ఇపుడు మకాం పెట్టారు.

మోడీకి ఘనస్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున విశాఖ వీధులలో రోడ్డు షో చేయాలని డిసైడ్ అయ్యారు. మోడీ సభకు లక్ష మందికి తక్కువ కాకుండా జనాలను సమీకరించాలని నిర్ణయించారు. విశాఖలో మోడీ వచ్చే మార్గంలో  సోము వీర్రాజు, జీవీఎల్ కొందరు నాయకులు ఫీల్డ్ సర్వే కూడా చేశారు. ఇదంతా సరేనని అనుకున్నా బీజేపీకి అంత బలం ఎక్కడ ఉంది. లక్షలాది మందితో సభను నిర్వహించాలని ఆ పార్టీ  ప్రకటించినా మాటలా అంటే జవాబు లేదు.

అయితే వైసీపీ ప్రధాని సభను సవాల్ గా తీసుకుని జనసమీకరణ చేస్తోంది కాబట్టి సభలో లక్షలాది జనం రావడం ఖాయం. అందులో బీజేపీ వాటా ఎంత ఉందో వారే చెప్పాల్సి ఉంటుంది. మోడీ విశాఖ టూర్ లో మిత్రపక్షం జనసేనను పిలుస్తున్నారా అన్న దాని మీద క్లారిటీ లేదు.

బీజేపీ సొంతంగానే జనసమీకరణ చేయాలనుకోవడం చూస్తే సేనను సైడ్ చేసినట్లుగానే ఉంది అంటున్నారు. దీంతో ప్రధాని అధికారిక సభ పూర్తిగా వైసీపీ బీజేపీలతోనే సాగుతుందని తెలుస్తోంది. వైసీపీ మోడీ టూర్ ని హైలెట్ చేస్తోందని బీజేపీ నేతలు ఒక వైపు అంటున్నా ప్రధాని సభలో జనాలు కళకళలాడాలంటే అధికార వైసీపీ తోడు ఉండి తీరాల్సిందే అన్నది అసలు సత్యం. అయినా భేషజంగా పైకి మా ప్రధాని మా బీజేపీ మనిషి అని బీజేపీ నేతలు హడావుడి చేస్తున్నారు అని అంటున్నారు.