లవ్ స్టోరీ- భావోద్వేగాల మేళవింపు

దర్శకుడు శేఖర్ కమ్ముల అంటేనే తెరనిండా భావోద్వేగాలు పరుచుకుంటాయి. ఫిదా సినిమాతో యంగ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన ఆయన ఇప్పుడు ఓ కొత్త పాయింట్ తో లవ్ స్టోరీ సినిమాతో మళ్లీ తన…

దర్శకుడు శేఖర్ కమ్ముల అంటేనే తెరనిండా భావోద్వేగాలు పరుచుకుంటాయి. ఫిదా సినిమాతో యంగ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన ఆయన ఇప్పుడు ఓ కొత్త పాయింట్ తో లవ్ స్టోరీ సినిమాతో మళ్లీ తన మార్కు మ్యాజిక్ ను చూపించబోతున్నారు. 

చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో తయారైన లవ్ స్టోరీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను బయటకు వదిలారు

ట్రైలర్ లో సినిమా వన్ లైన్ ఆర్డర్ మొత్తం చెప్పేసారు. డ్యాన్స్ స్టూడియో పెట్టాలనే కుర్రాడు, సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ కావాలనుకునే అమ్మాయి, ఇద్దరూ ప్రేమలో పడడం, ఇళ్లలో అభ్యంతరాలు, ప్రేమ జంట జంప్, వారి వెనుక పరుగులు…ఇలా మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు.

ఇప్పటికే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ట్రైలర్ అచ్చంగా శేఖర్ కమ్ముల మార్క్ తో వుంది.  బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పెద్ద అసెట్ గా అనిపిస్తోంది.ఈ సినిమాకు సునీల్ నారంగ్ నిర్మాత.