అవతార్ సీక్వెల్ ది వే ఆఫ్ వాటర్ వస్తోంది. డిసెంబర్ 16న విడుదల. ఈ సినిమాకు ఇప్పటికే భారీ హైప్ వచ్చింది. దాంతో కొనడానికి ట్రయ్ చేస్తున్నవాళ్లూ పెరిగారు. అయితే అవతార్ నిర్మాతలు సౌత్ ఇండియా నాలుగు రాష్ట్రాలకు కలిపి చెబుతున్న రేటు విని షాక్ అవుతున్నారు.
ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ నాలుగు రాష్ట్రాల, నాలుగు వెర్షన్లు కలిసి 150 కోట్లు చెప్పారట. దాంతో కొనేందుకు ఎంక్వయిరీ చేసిన వాళ్లు కళ్లు తేలపెట్టారు.
అయితే అలా అని వెనక్కూ తగ్గలేదు. 100 కోట్ల దగ్గర నుంచి బేరం మొదలుపెట్టారు. అది కూడా చాలా అంటే చాలా పెద్ద మొత్తమే. అంత వస్తుందా? నాలుగు రాష్ట్రాలు కలిపి అన్నది అనుమానమే. కానీ ఆ సినిమాకు వున్న బజ్ ను బట్టి 100 కోట్లు కోట్ చేయడానికి ధైర్యం చేసారు అనుకోవాలి. ఇలా కోట్ చేసిన నైజాం ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ తనతో పాటు మరికొందరి కలుపుకుని సిండికేట్ కింద కొనుగోలు చేయాలనుకున్నారు.
కానీ ఈ రేట్ తెలిసిన తరువాత చాలా మంది వెనుకడుగు వేసారు. ప్రస్తుతం సునీల్ మాత్రం ఇంకా బేరసారాలు సాగిస్తున్నారు. అవతార్ కు ఎంత క్రేజ్ వున్నా, సిటీ, అర్బన్ వరకు లాగగలదు కానీ అంతకు కిందకు దిగుతుందా అన్నది అనుమానం. మరి 100 నుంచి 120 కోట్లు రాబట్టాలంటే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి.