మనకు రానిది ట్రయ్ చేయకూడదు…వచ్చింది ఫ్రీగా చేయకూడదు అన్నది సినిమా మాట. కానీ ఒక్కోసారి ఏదో ఆశపడి ట్రయ్ చేస్తుంటారు. తమవి కాని జోళ్లలో కాళ్లు పెట్టి బొక్క బోర్లాపడుతుంటారు. ముఖ్యంగా మాస్ ఎలివేషన్ల సినిమా తీయాలని తెగ సరదా పడుతుంటారు.
క్లాస్ సినిమాలు చేసింది ఇంద్రగంటి 'వి' అయినా, మాంచి ఎమోషనల్ లవ్ స్టోరీలు అందించిన శివనిర్వాణ అయినా ఇదే బాపతు. ఇంద్రగంటి మళ్లీ తన స్టయిల్ సినిమాల్లోకి వచ్చేసారు. ఇప్పుడు శివ నిర్వాణ వంతు వచ్చింది.
టక్ జగదీష్ తరువాత ఓ యంగ్ హీరోతో మాంచి ఫన్ సినిమా చేయాలనుకున్నారు. కథ చెప్పారు. మార్పులు చేర్పులు జరిగాయి.అంతా బాగానే వుంది కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లు బోగట్టా.
నిర్మాతలు రెడీగా వున్నారు. మరో హీరోను వెదుక్కోవాలి. అయితే ఈసారి మళ్లీ లవ్ ఎమోషన్ జోనర్ లోనే కథ తయారు చేస్తే బెటర్ అనే సలహాను నిర్మాతలు శివనిర్వాణకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కథ తయారుచేసాక అప్పుడు హీరో ఎవరు దొరుకుతారా? అన్నది. మొత్తానికి టక్ జగదీష్ కు ముందు అనుకున్న ప్రాజెక్టు మాత్రం ఇక లేదని తెలుస్తోంది.