పవన్ గురించి మాజీ మిత్రుడు ఏం చెప్పారంటే…?

పవన్ కళ్యాణ్ మీద మాజీ మిత్రుడు. ఒకనాటి ఆయన ఎర్రెర్రని నేస్తం సీపీఎం నేత మధు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. జనసేన అధినేతగా పవన్ కి ఒక సిద్ధాంతం అంటూ లేదని మండిపడ్డారు.…

పవన్ కళ్యాణ్ మీద మాజీ మిత్రుడు. ఒకనాటి ఆయన ఎర్రెర్రని నేస్తం సీపీఎం నేత మధు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. జనసేన అధినేతగా పవన్ కి ఒక సిద్ధాంతం అంటూ లేదని మండిపడ్డారు. పొత్తుల గురించి పవన్ మాట్లాడం కంటే దురదృష్టం లేదని అన్నారు. 

ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా ఈ టైమ్ లో పొత్తుల మీద మాట్లాడమేంటని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా చేస్తున్న కుటిల రాజకీయం ఇదని ఆయన విశ్లేషిస్తున్నారు. తమతో ఒకపుడు పొత్తులు పెట్టుకున్న పవన్ తమకు తెలియకుండానే బీఎస్పీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారని, అదీ ఆయన సిద్ధాంత రాహిత్య వైఖరి అంటూ ఎండగట్టారు.

కామ్రేడ్స్ ముద్దు అని తమతో జత కలసిన పవన్ ఇపుడు బీజేపీ టీడీపీలతో పొత్తులకు అర్రులు చాచడం కంటే రాజకీయం వేరేది ఉండదని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తు అంటూ ఆరాటపడుతున్న పవన్ విభజన హామీల గురించి పెదవి విప్పకపోవడం దారుణమని కూడా మధు అన్నారు. 

మొత్తానికి పవన్ని జనసేనను కలిపి ఆయన చాలా మాటలే అనేశారు. మరి ఎర్రన్న మాటలకు జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.