గందరగోళంలో రామ్‌

సక్సెస్‌ వచ్చిందనే ఆనందం కంటే దానిని ఎలా నిలబెట్టుకోవాలనే ఆందోళనే ఎక్కువ ఇబ్బంది పెడుతోందట హీరో రామ్‌ని. ఇస్మార్ట్‌ శంకర్‌తో ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో దాని తర్వాత ఏమి చేయాలో…

సక్సెస్‌ వచ్చిందనే ఆనందం కంటే దానిని ఎలా నిలబెట్టుకోవాలనే ఆందోళనే ఎక్కువ ఇబ్బంది పెడుతోందట హీరో రామ్‌ని. ఇస్మార్ట్‌ శంకర్‌తో ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో దాని తర్వాత ఏమి చేయాలో తెలియని గందరగోళానికి గురవుతున్నాడట. ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన వున్నా కానీ ప్రస్తుతానికి పూరి జగన్నాధ్‌ దగ్గర అందుకు కావాల్సిన ఐడియా లేదు.

పూరి ఎప్పటిలా తన మలి చిత్రాన్ని వెంటనే ఖాయం చేసేసుకుని విజయ్‌ దేవరకొండతో చిత్రాన్ని లాక్‌ చేసేసుకున్నాడు. కానీ రామ్‌ మాత్రం అంతకుముందు ఓకే చేసి పెట్టుకున్న కథలని కూడా కాదనుకుని గ్యాప్‌ తీసేసుకున్నాడు. గతంలో పలుమార్లు ఘన విజయాలు అందుకున్న రామ్‌ ఎప్పుడూ దానిని నిలకడగా నిలబెట్టుకున్న దాఖలాలు లేవు.

ఇస్మార్ట్‌తో కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిన రామ్‌ ఈసారి ఆ తప్పు రిపీట్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఇప్పుడు తాను ఇస్మార్ట్‌ సక్సెస్‌ని క్యాష్‌ చేసుకునే మాస్‌ సినిమా చేయాలా, తనకి చాలా సార్లు కలిసి వచ్చిన లవ్‌, ఫ్యామిలీ జోనర్‌లో చేయాలా అనే చిక్కు సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఎంత గ్యాప్‌ వచ్చినా కానీ ఈసారి సాలిడ్‌ స్క్రిప్ట్‌ దొరికితే తప్ప నెక్స్‌ట్‌ సినిమా ట్రాక్‌ ఎక్కించకూడదని మాత్రం గట్టిగా ఫిక్సయ్యాడు. 

సినిమా రివ్యూ: సాహో