ఎన్టీఆర్ మ్యూట్ మోడ్

ఎన్టీఆర్ చేతిలో ఆర్ఆర్ఆర్ కాకుండా రెండు సినిమాలు వున్నాయి. ఒకటి కొరటాల శివ..స్టూడెంట్ లీడర్ కాన్సెప్ట్. మరొకటి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ. అంతకు మించి మరో అడుగు పడలేదు.  Advertisement వెట్రీమారన్…

ఎన్టీఆర్ చేతిలో ఆర్ఆర్ఆర్ కాకుండా రెండు సినిమాలు వున్నాయి. ఒకటి కొరటాల శివ..స్టూడెంట్ లీడర్ కాన్సెప్ట్. మరొకటి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ. అంతకు మించి మరో అడుగు పడలేదు. 

వెట్రీమారన్ తో మూవీ అన్నవి కూడా పక్కా గాలి వార్తలే.  ఇంతకీ ఎన్టీఆర్ ఆలోచన ఏమిటీ? అంటే ఇంట్రస్టింగ్ అప్ డేట్ వుండనే వుంది. ఆర్ఆర్ఆర్ విడుదలై,  మిగిలిన లాంగ్వేజ్ ల్లో తనకు వచ్చే రిక్నగైజేషన్ బట్టే ఎన్టీఆర్ నిర్ణయం వుంటుంది.  

అప్పుడు ఏ జోనర్ లో సినిమా చేయాలి? పాన్ ఇండియా చేయాలా? జస్ట్ తెలుగు సినిమా చేయాలా? అన్నది డిసైడ్ చేసుకుంటారు. అదే విధంగా బ్రాండ్ అంబాసిడర్ గా వుండమని వస్తున్న కంపెనీలను కూడా పక్కన పెడుతున్నారు. కొద్ది కాలం ఆగమని చెబుతున్నారు. 

ఆర్ఆర్ఆర్ తరువాత తనకు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నారు. అందుకే కొన్నాళ్లు ఆగిన తరువాతే ఏనిర్ణయం అయినా తీసుకోవడాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన నిర్ణయాలను మ్యూట్ మోడ్ లోకి తోసారు,.