బ్రిడ్జి ప్రమాదం.. ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి!

గుజ‌రాత్ లోని మోర్జీ వంతెన కూలిన ప్ర‌మాద ఘట‌న‌లో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా కుటుంబ…

గుజ‌రాత్ లోని మోర్జీ వంతెన కూలిన ప్ర‌మాద ఘట‌న‌లో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా కుటుంబ సభ్యులు పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు పిల్లలతో సహా కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయిన‌ట్లు ఎంపీ తెలిపారు.

మోర్బి వ‌ద్ద మ‌చ్చూ న‌దిపై ఉన్న చ‌రిత్రాత్మ‌క కేబుల్ బ్రిడ్జిని 140 ఏళ్ల కింద‌ట క‌ట్టించారు. పాతబ‌డిపోవ‌డంతో కొన్ని సంవ‌త్స‌రాలు మూసివేసి, రిపేర్లు, రెనోవేష‌న్ ప‌నులు చేసిన త‌ర్వాత గుజారాత్ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ నెల 26న బ్రిడ్జిని రీఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన నాలుగు రోజుల‌కే ఈ ఘెరం జ‌రిగిపోయింది. కేవ‌లం 100 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉన్న సెల‌వు కావ‌డంతో దాదాపు 500 మందికిపైగా బ్రిడ్జి పైకి వెళ్ల‌డం వ‌ల్లే కూలిపోయిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 140 మందికి పైగా మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. సుమారు 177 మందిని అధికారులు ర‌క్షించారు. ప్ర‌మాదంలో తీవ్ర గాయాలు అయిన వారు చికిత్స పొందుతున్నారు. మచ్చు నదిలో పడిన వారిని రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)కు చెందిన ఐదు బృందాలు నిన్న‌టి నుండి శ్రమిస్తున్నాయి.