విద్యుత్తు పీపీఏల్లో అడుగు ముందుకు పడేదెలా?

విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం భారీఎత్తున అవినీతికి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు- పీపీఏలను సమీక్షించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ఒప్పందాలను సమీక్షించి.. అవినీతిని…

విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం భారీఎత్తున అవినీతికి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు- పీపీఏలను సమీక్షించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ఒప్పందాలను సమీక్షించి.. అవినీతిని అక్రమాలను నిగ్గుతేల్చడం, తులనాత్మకంగా చాలా ఎక్కువ ధరలకు ఒప్పందాలు కుదిరినందున.. వాటిని సమీక్షించి తగ్గించే ప్రయత్నం చేయడం- ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం. అయితే ఈ విషయంలో కేంద్రం కూడా అడ్డుపుల్లలు వేస్తుండడంతో అడుగు ముందుకుపడడం కష్టంగా కనిపిస్తోంది.

జగన్ ప్రభుత్వం పీపీఏల సమీక్షకు కమిటీ వేయగానే.. సదరు సంస్థలు సహజంగానే కోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చాయి. దీని మీద విచారణ సందర్భంగా రాష్ట్రప్రభుత్వానికి సమీక్షకు అధికారమే లేదని వారు వాదిస్తున్నారు. తాజాగా విచారణలో కేంద్రప్రభుత్వం తరఫున వారి న్యాయవాది వాదిస్తూ అక్రమాలు జరిగాయని తేలితే తప్ప ఒప్పందాలు రద్దు చేయడానికి వీల్లేదంటూ ఓ అడ్డుపుల్ల వేశారు. నిజానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేసేయడానికి చూస్తున్నదంటూ ఓ దుష్ప్రచారం సాగింది.

జగన్ ప్రభుత్వం వాటి రద్దుకోసం ఎగబడడం లేదు. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించడానికి మాత్రమే చూస్తోంది. ఒకవైపు తక్కువ ధరకు థర్మల్ విద్యుత్తు పుష్కలంగా లభ్యమవుతూ ఉండగా, ఈ కొత్త ఒప్పందాల్లో సౌర, పవన విద్యుత్తును అత్యధిక ధరలకు కొనేలా కుదిరిన ఒప్పందాలనే సమీక్షించదలచుకుంటోంది. రేట్లు తగ్గించుకోమని కోరడం, తద్వారా ఖజానాకు మేలుచేయడం తప్ప.. సర్కారుకు మరో ఉద్దేశంలేదు. అయితే అంతా అడ్డుపుల్లలు వేస్తున్నారు.

ఒప్పందాలలో అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేయవచ్చునని కేంద్రం కూడా హైకోర్టు ముందు చెబుతోంది. అయితే ఆ అక్రమాలను తేల్చాలంటే.. సమీక్ష జరగాల్సిందే కదా అని ప్రజలు అనుకుంటున్నారు. సమీక్షించి సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప.. అక్రమాలు తేలేదెలా అనుకుంటున్నారు. పీపీఏల సమీక్షకు ఆదేశించినప్పటి నుంచి చాలామందిలో కంగారు ఉంది.

అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఆవేదన చెందారు. కేంద్రం కూడా అభ్యంతరాలు చెబుతోంది. జపాన్ రాయబారి కూడా వద్దంటూ సర్కారుకు లేఖ రాశారు. కేవలం సమీక్ష అనగానే- ఇందరు ఇంత కంగారు ఎందుకు పడుతున్నారనేదే సామాన్యులకు అర్థంకాని సంగతి.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం