హ్యాట్రిక్‌ లక్ష్యంగా కేసీఆర్ లిస్ట్!

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైం ఉన్న నాలుగు స్థానాలు మినహా మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు…

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైం ఉన్న నాలుగు స్థానాలు మినహా మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగనున్నారు.

ఇవాళ బీఆర్ఎస్ అఫీస్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. 2023 ఎన్నికలకు పెద్దగా మార్పుల్లేవ్‌. మంచి ముహూర్తం ఉండడంతోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఉప్పల్‌, వేములవాడ, మెట్‌పల్లి సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చారు. జనగామ, నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్ స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి.

వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌.. హ్యాట్రిక్‌ లక్ష్యంగా ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 95-105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. సీట్లు రానివారికి పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు. బ‌హుశా బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న‌తో కాంగ్రెస్ పార్టీ కూడా ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థులు తేలిన తర్వాత ఆయా పార్టీల్లోని అసంతృప్తి నాయకులను క‌లుపుకోని బీజేపీ పార్టీ కూడా అభ్య‌ర్థుల‌ను ప్రకటించే అవకాశం ఉంది.