సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు!

ఎన్నికలు అయినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంత గట్టిగా మాట్లాడటంలేదు. పార్టీ పవర్ లో ఉన్నరోజుల్లో సోమిరెడ్డి కథే వేరు! జగన్ మీద గయ్యిమంటూ రెచ్చిపోయేవారు. అంతర్జాతీయ పరిణామాలకూ జగన్ కు ముడిపెడుతూ…

ఎన్నికలు అయినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంత గట్టిగా మాట్లాడటంలేదు. పార్టీ పవర్ లో ఉన్నరోజుల్లో సోమిరెడ్డి కథే వేరు! జగన్ మీద గయ్యిమంటూ రెచ్చిపోయేవారు. అంతర్జాతీయ పరిణామాలకూ జగన్ కు ముడిపెడుతూ మాట్లాడగల మేధావి ఈ రెడ్డిగారు. తన మేధ మీద నమ్మకంతోనో లేక వరసగా పలుసార్లు ఓడిపోయిన తన ప్రజాబలం మీద నమ్మకంతోనో సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశారు.

రెండూ పోయాయి. ఎమ్మెల్సీ పదవీ పోయింది, ఎమ్మెల్యేగానూ నెగ్గలేకపోయారు. ఏదేమైనా నారాలోకేష్ కన్నా సోమిరెడ్డి చాలా పవర్ ఫుల్ అనే విషయం అయితే రుజువు అయ్యింది. ఎమ్మెల్యేగా నెగ్గే నమ్మకం లేక నారాలోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనేలేదు. అయితే సోమిరెడ్డి మాత్రం విశ్వాసంతో ముందుకు వెళ్లారు. లోకేష్ కు తన మీద నమ్మకం ఉండి, గెలుపు మీద నమ్మకం లేక ఎమ్మెల్సీ పదవిని అట్టే పెట్టుకున్నారు. సోమిరెడ్డి తన మీద తనకున్న నమ్మకంతో పోరాడారు. అయినా ఫలితం దక్కలేదు.

ఆ సంగతలా ఉంటే.. ఈ మాజీ మంత్రిగారి మీద ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. ఒక భూ వివాదంలో సోమిరెడ్డి తలదూర్చి తన పేరిట నకిలీ పత్రాలను సృష్టించుకున్నారట. వాటిని ఆధారంగా చేసుకుని ఆ భూమిని అమ్మారట. ఆ వ్యవహారంలో బాధితుడు కోర్టుకు ఎక్కగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 420తో సహా వివిధ అభియోగాలతో సోమిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఎవరికో సంబంధించిన ఆస్తిని కాజేసీ అమ్ముకున్న అభియోగాలతో ఈయనపై కేసులు నమోదుకావడం గమనార్హం.

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్!