వి ఎపిక్ థియేటర్ విశేషాలు

సినిమా నిర్మాణ రంగంతో పాటు పంపిణీ, థియేటర్ల రంగంలో కూడా తనదైన ముద్రతో వుంది యువి నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నెల్లూరు సమీపంలోని సూళ్లూరు పేటలో ఓ బ్రహ్మండమైన థియేటర్ కాంప్లెక్స్ ను…

సినిమా నిర్మాణ రంగంతో పాటు పంపిణీ, థియేటర్ల రంగంలో కూడా తనదైన ముద్రతో వుంది యువి నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నెల్లూరు సమీపంలోని సూళ్లూరు పేటలో ఓ బ్రహ్మండమైన థియేటర్ కాంప్లెక్స్ ను నిర్మించింది. థియేటర్లు, గేమింగ్ జోన్ లు, షాపింగ్ అన్నీకలిసి ఒకేచోట వుండేలా ప్లాన్ చేసారు.

ఈ థియేటర్లను ఈనెల 29న హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమంలో ప్రారంభిస్తారు. 30న సాహోతో థియేటర్లు ప్రారంభమవుతాయి. మూడు ఎకరాల స్థలంలో మూడు స్క్రీన్ లతో ఈ థియేటర్ ను నిర్మించారు. అత్యాధునిక సాంకేతికతను థియేటర్లలో వాడారు. 

వీటిల్లో ఒక స్క్రీన్ సైజు 100 అడుగుల ఎత్తు, 54 అడుగుల వెడల్పు. అంచనాగా చెప్పాలంటే పది అంతస్థుల అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ అంత ఎత్తు అన్నమాట. 656 మంది ఒకేసారి ఈ థియేటర్లో సినిమా చూడొచ్చు. 4కె రిజల్యూషన్ తో ప్రదర్శన వుంటుంది. భారతదేశంలోనే అతి పెద్ద స్క్రీన్ ఇది. 

మిగిలిన రెండు స్క్రీన్ లలో 140 మంది వంతున సీటింగ్ ఏర్పాటు చేసారు. ఒక స్క్రీన్ లో తొలిసారిగా సీట్ల కింద సబ్ ఊఫర్ లు ఏర్పాటుచేయడం విశేషం. టోటల్ గా అన్ని థియేటర్ లలో అద్భుతమైన అడియో, వీడియో ఎక్స్ పీరియన్స్ వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

చెన్నయ్-తిరుపతి రూట్ లో వున్న ఈ థియేటర్ కాంప్లెక్స్ భవిష్యత్ లో ఓ టూరిస్ట్ హబ్ గా మారే అవకాశం వుంది.