పత్రికలకు హీరోలు దూరం

హీరోలు అంటే సినిమాల్లోనే. పది మందిని ఒంటి చేత్తో కొట్టి, ఎత్తి అవతలకు విసిరేస్తారు. కానీ నిజ జీవితంలో వేరే. కరోనా అంటే మరీ భయం. ఎంతయినా మనుషులే కదా. అందుకే షూటింగ్ లకు…

హీరోలు అంటే సినిమాల్లోనే. పది మందిని ఒంటి చేత్తో కొట్టి, ఎత్తి అవతలకు విసిరేస్తారు. కానీ నిజ జీవితంలో వేరే. కరోనా అంటే మరీ భయం. ఎంతయినా మనుషులే కదా. అందుకే షూటింగ్ లకు దూరంగా వున్నారు. ఎంత దూరంగా అంటే వ్యాక్సీన్ రావాల్సినంత దూరం. హీరోలు కరోనాకు ఎంత భయపడుతున్నారు అంటే చాలా మంది పెద్ద హీరోలు తమ ఇళ్లకు పత్రికలు కూడా తెప్పించడం మానేసారని బోగట్టా.

పత్రికల ద్వారా కూడా కరోనా వ్యాప్తికి అవకాశం వందని వార్తలు రావడంతో వాటికి హీరోలు ఫుల్ స్టాప్ పెట్టేసారని తెలుస్తోంది. పత్రికల ద్వారా కరోనా వ్యాపించదని నమ్మించడానికి మీడియా ఎంత ప్రయత్నించినా, ఎంత పేపర్ ను శానిటైజ్ చేసినా జనం అంతగా నమ్మడం లేదు. హీరోలు కూడా అదే మాదిరిగా వున్నారు.

ఇటీవల ఓ సినిమా పత్రిక ను కొన్ని కాపీలు ప్రింట్ చేసి, సినిమా జనాల ఇళ్లకు బాయ్ ద్వారా పంపగా, చాలా మంది హీరోల సెక్యూరిటీ జనాలు వద్దు అని వెనక్కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు, ప్రస్తుతం దినపత్రికలే ఆపేసామని, అవన్నీ తెప్పించడం మొదలుపెట్టాక సినిమా పత్రికలు తీసుకుంటామని సెక్యూరిటీ జనాలు స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది.

పత్రికలు ఇంట్లోకి రావడానికే హీరోలు భయపడుతుంటే, షూటింగ్ లకు కాళ్లు బయట ఎలా, ఎప్పుడు పెడతారో?

నాయకుడంటే అర్థం తెలిసింది