ఆ దర్శకుడు రూమ్ కు రమ్మన్నాడు: విద్యాబాలన్

కాస్టింగ్ కౌచ్ బాధిత నటీమణుల్లో తను కూడా ఒకరు అని అంటోంది విద్యాబాలన్. ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వివరించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో చాలామందే ఉన్నారు.…

కాస్టింగ్ కౌచ్ బాధిత నటీమణుల్లో తను కూడా ఒకరు అని అంటోంది విద్యాబాలన్. ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వివరించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో చాలామందే ఉన్నారు. ఇప్పుడు అందులోకి జాయిన్ అయ్యింది ఈ స్టార్ హీరోయిన్.

బాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న విద్యాబాలన్ తను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది. ఒక దర్శకుడు తనను రూమ్ కు రమ్మంటూ పిలిచాడని విద్యా చెప్పడం గమనార్హం. ఒక సినిమా కాన్సెప్ట్ చెప్పడానికి అంటూ ఒక దర్శకుడు తనవద్దకు వచ్చాడని, కథను వివరించడానికి సమయం కోరాడని చెప్పింది. తను అందుకు ఓకే చెప్పి, కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పగా ఆ దర్శకుడు మాత్రం తన రూమ్ కు రావాలని కోరాడని విద్య వివరించింది.

రూమ్ కు ఎందుకు, కాఫీ షాప్ లో కలుద్దామని తను పలుసార్లు చెప్పినా, అతడు మాత్రం రూమ్ కే రమ్మంటూ వెకిలిగా మాట్లాడాడు అని విద్య చెప్పింది. అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తను తలుపు తెరిచి, బయటకు వెళ్లమన్నట్టుగా చూడగా.. ఐదు నిమిషాలు ఎగాదిగా చూసి బయటకు వెళ్లిపోయాడని విద్య చెప్పింది. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పిన ఈ నటీమణి ఆ దర్శకుడు ఎవరో, అతడి రేంజ్ ఏమిటో చెప్పలేదు.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!