నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్న చంద్రబాబు!

ఆశావర్కర్ల కష్టాన్ని దోపిడీ చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. వారి సేవలు ప్రజలకు అందకపోయినా పట్టించుకోనూ లేదు.. అలాగని వారి వేతనాలు పెంచనూ లేదు. అలాంటి ఆశా వర్కర్లకు జగన్మోహన రెడ్డి సీఎం కాగానే.. ఒకేసారి…

ఆశావర్కర్ల కష్టాన్ని దోపిడీ చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. వారి సేవలు ప్రజలకు అందకపోయినా పట్టించుకోనూ లేదు.. అలాగని వారి వేతనాలు పెంచనూ లేదు. అలాంటి ఆశా వర్కర్లకు జగన్మోహన రెడ్డి సీఎం కాగానే.. ఒకేసారి పదివేల రూపాయల జీతం చేశారు. గౌరవప్రదమైన వేతనం ఇస్తున్నప్పుడు.. పనిపట్ల వారి బాధ్యతను, జవాబుదారీ తనాన్ని పెంచే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ విషయాన్ని ఏదో వారిని ఉద్యోగాల్లోంచి తొలగించే కుట్రగా అభివర్ణిస్తూ, చంద్రబాబు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదంతా ఒకఎత్తు అయితే.. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తల గురించి పెయిడ్ ఆర్టిస్టులంటూ ఏదో ఒక మార్ఫింగ్ కథను వైకాపా నేతలు సృష్టిస్తారంటూ ఆయన పేర్కొనడం చిత్రంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలోకి వచ్చినా వారికి అది మామూలే అంటూ.. విమర్శించారు. ఇవన్నీ ట్విటర్ వేదికమీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు!

చూడబోతే.. ఇటీవల జగన్‌ను, మంత్రి అనిల్‌ను తూలనాడుతూ దొరికిపోయిన పచ్చదళం పెయిడ్ ఆర్టిస్టు శేఖర్ చౌదరి వ్యవహారాన్ని గురించి.. చంద్రబాబునాయుడు సమర్థించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అతను అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత.. చంద్రబాబు ఇంత నిస్సిగ్గుగా ఎలా తన చేతలను సమర్థించుకుంటున్నారో ప్రజలకు అర్థం కావడంలేదు. ఎందుకంటే.. దొరికిపోయిన వ్యక్తి.. తాను పెయిడ్ సర్వీసుగానే రైతు వేషంలో ఆ వీడియోపోస్టు పెట్టినట్టు పోలీసులకు వెల్లడించాడు.

వారేదో బలవంతాన చెప్పించారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. అదే వ్యక్తి.. ఎన్నికల సమయంలో తెలుగుదేశం యాడ్స్‌లో నటించాడు. ఇంత పచ్చిగా దొరికిపోయిన తర్వాత.. ‘‘పెయిడ్ ఆర్టిస్టులంటూ  మార్ఫింగ్ కథనం సృష్టిస్తారని’’ చంద్రబాబు చెప్పడం హేయంగా ఉంది. ఇదే ఆశా కార్యకర్తల విషయంలో.. తెలంగాణలో జరుగుతున్న రోడ్డెక్కిన పోరాటం ఫోటోలను వాడుకుంటూ.. జగన్ వ్యతిరేక ఉద్యమంలాగా బిల్డప్ ఇచ్చి ట్వీట్ చేసిన అవివేకం చంద్రబాబునాయుడు సొంతం.

అందులో ఉన్న లేకితనం బయటపడగానే.. ఆయన తన ట్విటర్ ఖాతానుంచి నిస్సిగ్గుగా ఆ పోస్టును తొలగించుకున్నారు. ఇప్పుడు మళ్లీ వైకాపా వారి మీద మార్ఫింగ్‌తో విమర్శలు చేస్తారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఆశా కార్యకర్తల్లో ప్రజలకు సేవలందించడం పట్ల జవాబుదారీతనం పెంచడాన్ని కూడా తప్పుపడితే.. ఆయన విచక్షణ ఏ గంగలో కలిసిందో ప్రజలకు అర్థంకావడం లేదు.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!