కొన్నినెలల కిందట దక్షిణాది ప్రముఖ నటుడు అర్జున్ పై నటి శ్రుతీహరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా అర్జున్ తనను వేధించాడని ఆమె ఆరోపించింది. దర్శకుడితో కలిసి తనపై అసభ్య వ్యాఖ్యలు చేశాడని, రొమాంటిక్ సీన్ల చిత్రీకరణలో అయితే చిత్ర హింసలు పెట్టాడని ఆమె పేర్కొంది. 'ఫోర్ ప్లే చేద్దామా..' అంటూ వ్యాఖ్యానించాడని ఆమె చెప్పింది. అర్జున్ పై పోలీసులకూ ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంలో కన్నడ చిత్రపరిశ్రమ ప్రముఖులు జోక్యం చేసుకున్నారు. వారి మధ్య రాజీకి ప్రయత్నించారు. అయితే శ్రుతీ హరిహరన్ రాజీకి ముందుకురాలేదు. అర్జున్ పై తను చేసిన ఫిర్యాదులపై పోరాడనున్నట్టుగా ఆమె ప్రకటించింది. ఆ కేసుల్లో అర్జున్ పోలిస్ స్టేషన్ కు కూడా హాజరవుతూ వస్తున్నాడు.
ఇక మరోవైపు ఆమెపై కూడా కేసులు నమోదయ్యాయి. అర్జున్ కుటుంబీకులు ఆ ఫిర్యాదులు చేశారు. తమ తండ్రి పరువుకు భంగం కలిగిస్తోందని అర్జున్ సంతానం ఆమెపై కేసులు నమోదు చేశారు. ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావాను వేశారు. అందుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతూ ఉంది.
అయితే తనపై అనవసరంగా కేసులు పెట్టారని, ఆ కేసులు చెల్లవని శ్రుతి మళ్లీ కోర్టుకు ఎక్కింది. కానీ ఆమెకు అక్కడ ఊరట లభించలేదు. ఆ కేసును కొట్టేయాలని ఆమెవేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కేసు కొనసాగుతుందని స్పష్టంచేసింది.