మే సినిమాలకు కోవిడ్ భయం

ఆంధ్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు వెయ్యికేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, చిత్తూరు, విశాఖ తదితర ప్రాంతాల్లో ఎక్కువగ కేసులు నమోదు అయ్యాయి, ప్రతి జిల్లాలో కనీసం పాతిక కేసులు తక్కువ…

ఆంధ్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు వెయ్యికేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, చిత్తూరు, విశాఖ తదితర ప్రాంతాల్లో ఎక్కువగ కేసులు నమోదు అయ్యాయి, ప్రతి జిల్లాలో కనీసం పాతిక కేసులు తక్కువ లేకుండా వున్నాయి. తెలంగాణలో కూడా కేసుల పరిస్థితి ఇలాగే వుంది. 

ఇలాంటి నేపథ్యంలో మే లో విడుదలవుతున్న సినిమాల పరిస్థితి లాటరీ లా వుంది. తొలివారంలో వకీల్ సాబ్ లాంటి భారీ సినిమా, మలివారంలో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ, ఆపై వారంలో టక్ జగదీష్, తలైవా, నెలాఖరులో విరాటపర్వ వున్నాయి. కేసుల పెరిగిపోయి సినిమాల విడుదల ఆగిపోతే అది వేరే సంగతి.

అలా కాకుండా సినిమాలు విడుదల తరువాత ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ నిబంధన వచ్చినా, లేదా కరోనాకు భయపడి జనం దూరంగా వున్నా చాలా పెద్ద లాస్ తప్పదు. ఇప్పుడు ఇదే టాలీవుడ్ నిర్మాతలను కలవరపెడుతోంది. 

గత వారం రోజులుగా కరోనా మీద మీడియా ఎక్కువ హడావుడి చేస్తోందని, వాస్తవంగా అంత వ్యాప్తి లేదని టాలీవుడ్ జనాలు అనుకుంటూ వచ్చారు. కానీ మళ్లీ అఫీషియల్ బులిటెన్ లు ప్రారంభమయ్యాయి.వాటిలో క్లారిటీ కనిపిస్తోంది. 

అలాగే మళ్లీ లాక్ డౌన్ భయంతో హైదరాబాద్ వదిలి వెళ్తున్నవారు రైల్వే స్టేషన్లలో కనిపిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడకు దారితీస్తాయో అని టాలీవుడ్ నిర్మాతలు కలవరపడుతున్నారు.