ముఠామేస్త్రీ మరోసారి

మెగా ఫ్యాన్స్ ఆఖరి ఆశ.…సైరా..లాంటి యావరేజ్…ఆచార్య లాంటి డిజాస్టర్…గాడ్ ఫాదర్ లాంటి డిఫరెంట్ సినిమాల తరవాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా వాల్తేర్ వీరయ్య. అన్ని ప్రయత్నాలు విదిలి మళ్లీ తనకు అచ్చి వచ్చిన…

మెగా ఫ్యాన్స్ ఆఖరి ఆశ.…సైరా..లాంటి యావరేజ్…ఆచార్య లాంటి డిజాస్టర్…గాడ్ ఫాదర్ లాంటి డిఫరెంట్ సినిమాల తరవాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా వాల్తేర్ వీరయ్య. అన్ని ప్రయత్నాలు విదిలి మళ్లీ తనకు అచ్చి వచ్చిన స్టయిల్ లోకి వెళ్లి, ముఠామేస్త్రీ లాంటి సినిమా మరోసారి ప్రయత్నిస్తున్న వైనం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కమ్ టీజర్ వచ్చింది. 

అవుట్ అవుట్ వింటేజ్ చిరంజీవి ని చూపించే ప్రయత్నం చేసారు దర్శకుడు బాబి. భారీ యాక్షన్ కట్ లోంచి ఓ బిట్ తీసి టీజర్ లో వేసారు. ఈ వయసులో కూడా చిరంజీవి గ్రేస్, లుక్ బాగున్నాయి. ముఠామేస్త్రి చిరంజీవిని మళ్లీ చూసినట్లుంది. 

చిరంజీవి ఫ్యాన్స్ కు ఏం కావాలో అవే టీజర్ లో పరుచుకున్నాయి. లుక్స్, నడక, గెటప్ ఇలా అన్నీ కూడా వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసాయి. ఆ విధంగా అన్ని విధాలా టీజర్ పాస్ అయింది.

ఇది చిరుకు టెస్టింగ్ టైమ్. వయసుకు తగిన పాత్రలు వేసి జనాలను అలరించే సినిమాలు ఇవ్వలేక వెనుకపడ్డారు. ఇప్పుడు వయసు పక్కన పెట్టి మళ్లీ పాత తరం సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది హిట్ అయితే మెగాస్టార్ రూట్ డిసైడ్ అవుతుంది. ఇప్పటి వరకు సగటు కంటెంట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు బాబి కి కూడా ఈ సినిమా బూస్ట్ ఇవ్వాల్సి వుంటుంది.