మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కులవృత్తిని ప్రస్తావిస్తూ దూషించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయ్యింది. తెలుగుదేశం వీరాభిమానులు అత్యుత్సాహంతో చేసినపని ఇప్పుడు ఆ పార్టీకే మచ్చగా మారనుంది. బీసీల పార్టీ అంటూ చెప్పుకుంటూ కొంతమంది చౌదరులు బీసీ కుల వృత్తిని కించపరుస్తూ మాట్లాడారు.
పెయిడ్ ఆర్టిస్టులతో ప్రతాపం చూపబోయి మొదటికే మోసం తెచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. తెలుగుదేశం ఎన్నికల యాడ్ లో నటించిన ఒక ఉత్తమనటుడు ఇప్పుడు రైతుగా తన నటనా చాతుర్యాన్ని చాటే ప్రయత్నం చేశాడు. హద్దూఅదుపు లేకుండా చెలరేగిపోయాడు. ఒక మంత్రిని పట్టుకుని కులవృత్తి ప్రస్తావన తెచ్చి.. నీలాంటోడిని మంత్రిని చేస్తే ఇలానే ఉంటుందంటూ ఆ జూనియర్ ఆర్టిస్టు రెచ్చిపోయాడు.
ఆ జూనియర్ ఆర్టిస్టుకు రైతు వేషం వేయించి అలాంటి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి రైతులు జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా రియాక్ట్ అయిపోతున్నారంటూ ప్రచారం చేయదలిచారు. అయితే అది ఇప్పుడు అడ్డం తిరిగింది. కుల వృత్తిని ప్రస్తావిస్తూ దూషించి తెలుగుదేశం వాళ్లు అడ్డంగా బుక్ అయ్యారు. దీనిపై యాదవ్ లు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు.
కుల వృత్తిని కించపరుస్తూ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరుస ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మొత్తానికి తెలుగుదేశం రాజకీయం సోషల్ మీడియాకే పరిమితం అయ్యి సాగుతూ ఉందనుకుంటే.. అక్కడ కూడా తేడా కొడుతున్నట్టుగా ఉంది రోజురోజుకూ!