ష‌ర్మిల వ‌ల్లే జ‌ల వివాదం జ‌ఠిలం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ మారుపేరు. నారాయ‌ణ విమ‌ర్శ‌ల‌కు లాజిక్‌ల‌తో సంబంధం ఉండ‌దు. ఏం మాట్లాడితే మీడియా అటెన్ష‌న్ ఉంటుందో బాగా తెలిసిన నాయ‌కుడాయ‌న‌.  Advertisement తాజాగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య…

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ మారుపేరు. నారాయ‌ణ విమ‌ర్శ‌ల‌కు లాజిక్‌ల‌తో సంబంధం ఉండ‌దు. ఏం మాట్లాడితే మీడియా అటెన్ష‌న్ ఉంటుందో బాగా తెలిసిన నాయ‌కుడాయ‌న‌. 

తాజాగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య జ‌ల వివాదం జ‌ఠిలం కావ‌డానికి కార‌ణ‌మేంటో ఆయ‌న చెప్పిన కార‌ణం సంచ‌ల‌నంగా మారింది. నారాయ‌ణ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఒక వ‌ర్గం మీడియాకు మసాలా అందించిన‌ట్టైంది.

నారాయ‌ణ బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో ష‌ర్మిల సొంత పార్టీ పెట్ట‌డంతో క‌వ‌ల‌లుగా ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌ల మ‌ధ్య జ‌ల వివాదం జ‌ఠిల‌మైంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

జ‌ల స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల్సి ఉందన్నారు. అయితే జ‌ల వివాదాన్ని అడ్డు పెట్టుకుని జ‌గ‌న్‌ను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని నారాయ‌ణ ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు రాజకీయ పరిష్కారం తప్ప ఏ కోర్టులు పరిష్కరించ లేవని ఆయ‌న తేల్చి చెప్పారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థ మొత్తం ఎందుక‌ని ఆయ‌న ప్రశ్నించారు. రాజధాని విషయంలో అసంబద్ధ వైఖరిని ప్రభుత్వం అవలంభిస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు.