డైరెక్టర్ పాట పాడేసారు

సాధారణంగా హీరోలు అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటారు. మ్యూజిక్ డైరక్టర్లు సరేసరి. కానీ డైరక్టర్లు పాటలు పాడిన దాఖలాలు తక్కువ.  Advertisement ఈ మధ్య ఆర్జీవీ తన గొంతుతో పాడేసారు. జనం విని చెవులు మూసుకున్నారా?…

సాధారణంగా హీరోలు అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటారు. మ్యూజిక్ డైరక్టర్లు సరేసరి. కానీ డైరక్టర్లు పాటలు పాడిన దాఖలాలు తక్కువ. 

ఈ మధ్య ఆర్జీవీ తన గొంతుతో పాడేసారు. జనం విని చెవులు మూసుకున్నారా? లేదా? అన్నది వేరే సంగతి. లేటెస్ట్ గా మరో దర్శకుడు సింగర్ గా మారినట్లు తెలుస్తోంది. 

నిన్నుకోరి, మజిలీ సినిమాలతో హిట్ లు కొట్టిన శివ నిర్వాణ లేటెస్ట్ గా టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో జస్ట్ ఓ బిట్ సాంగ్ వుందట. అది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు బదులుగా వస్తుందట. 

ఈ పాట కాస్త ఉత్తరాంధ్ర మాండలీకం స్టైల్ లో వుండడంతో, ఆ ప్రాంతానికే చెందిన శివే ఆలపించారని తెలుస్తోంది. సినిమా విడుదల అయితే పూర్తి విశేషాలు తెలుస్తాయి. 

చాలా కాలం తరువాత పల్లెటూరి కక్షలు కార్పణ్యాలు, కుటుంబసమస్యలు వంటి సబ్జెక్ట్ తో వస్తోంది టక్ జగదీష్. ఇందులో జగపతిబాబు, నాని అన్నదమ్ములుగా నటించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు.