పోర్న్ రాకెట్ కేసులో ఇప్పటి వరకూ రాజ్ కుంద్రాకు కనీసం బెయిల్ కూడా దక్కలేదు! అతడిని పోలీసులు తేలికగా వదిలేలా లేరు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ శిల్పా షెట్టికి మాత్రం ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు కూడా ఎదురుకాలేదు. వీడియోల వ్యవహారంలో శిల్ప ప్రమేయం ఉందనే అంశంపై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆమెను ప్రశ్నించారు కానీ, అరెస్టు చేయడం కానీ, ఆరెస్టు చేయబోతున్నట్టుగా చెప్పడం కానీ జరగలేదు. ఇక శిల్ప తన వర్క్ తో బిజీగా కనిపిస్తూ ఉంది.
మొదట్లో ఆ కేసు గురించి ఆవేదన చెందుతూ కోర్టుకు ఎక్కింది. తన పేరును ఇన్ వాల్వ్ చేస్తున్నారంటూ మీడియాపై పిటిషన్ వేసింది. అయితే కోర్టు నుంచి ఆమెకు ఊరట చర్యలేవీ రాకపోవడంతో ఆ తర్వాత ఆ వ్యవహారం గురించి స్పందించడం కూడా మానేసింది. ఒక టీవీ షోకు శిల్ప జడ్జిగా వ్యవహరిస్తూ ఆ పనిలో బిజీగా ఉన్నట్టుగా ఉంది. అయితే ఇప్పటికే శిల్పతో పలు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నాయట వివిధ సంస్థలు.
ఈ పరిణామాల నేపథ్యంలో శిల్ఫా షెట్టి తన భర్తకు దూరంగా జరగనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఉంటున్న అతడి ఇంటిని ఖాళీ చేయడంతో మొదలుపెట్టి, భర్త నీడ తన మీద పడకుండా ఆమె వ్యవహరించనుందట! అంతా బాగున్న స్థితిలో ఆ వీడియోల వ్యవహారంలో ఎందుకు తలదూర్చినట్టు అంటూ.. ఈమె తన భర్తను కూడా పోలీసుల ముందు గట్టిగా ప్రశ్నించిందట.
అసలు అలాంటి పని ఎందుకు చేయవలసి వచ్చిందంటూ నిందించిందట. అయితే భర్త తరఫున చట్టపరమైన పోరాటం చేయడం ఏమీ తేలికగా ఉన్నట్టుగా లేదు. అందుకే తను ఆ గొడవలన్నీ పక్కన పెట్టి తన పిల్లలతో సోలో లైఫ్ ను ప్రారంభించనుందట శిల్ప. రాజ్ సంపాదించిన ఆస్తులకూ, బంగ్లాలకు దూరంగా.. ఈమె జీవించనుందట. ఎలాగూ శిల్పకు కనీస సంపాదన, వ్యక్తిగత ఆస్తులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో సోలోగా జీవించడం కష్టం కాకపోవచ్చు.
ఇక రాజ్ ఆస్తులను కూడా ఇంకా పెద్దగా అటాచ్ చేసిన వార్తలు ఏవీ లేవు. పోర్న్ తో రాజ్ ఎంత సంపాదించాడు? అనే నిర్ధారణ జరిగినప్పుడు మాత్రమే పోలీసులు వాటిని అక్రమాస్తులుగా పేర్కొనగలరేమో. అయితే కుంద్రా పోర్న్ వ్యాపారంలో చాలా పాతవాడు కాదని పోలీసులే చెబుతున్నారు. అతడు ఏడాదిన్నర నుంచినే ఈ దందాను మొదలుపెట్టాడని వారు ధ్రువీకరించుకున్నారు. దీంతో అంతకు ముందు కుంద్రా సంపాదించిన ఆస్తులకూ, ఈ వ్యవహారానికి కూడా పెద్దగా ముడిపడదేమో!