రెడ్డి గారికి బీజేపీ ఆశ్రయం ఇవ్వనుందా!

తెలుగుదేశం హయాంలో అవినీతి వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో అక్రమాలు, బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకున్న వారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశ్రయంగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి అభిప్రాయాలు వినిపించడానికి కారణాలు ఏమిటో…

తెలుగుదేశం హయాంలో అవినీతి వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో అక్రమాలు, బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకున్న వారికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశ్రయంగా మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి అభిప్రాయాలు వినిపించడానికి కారణాలు ఏమిటో చెప్పనక్కర్లేదు. అటు విదేశీ బ్యాంకులకు, ఇటు స్వదేశీ బ్యాంకులకు టోపీ పెట్టిన ఒక పెద్దమనిషి ఇటీవల బీజేపీలోకి చేరి పుణీతుడు అయిన సంగతి తెలిసిందే. ఇక బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తెచ్చుకుని శ్రీమంతుడుగా చలామణి అవుతున్న కర్నూలు పెద్దమనిషి కూడా కమలం పార్టీలోకి చేరి దేశభక్తుడు అయ్యాడు.

వారేగాక అవతవకల కాంట్రాక్టర్లు కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుని షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీలోకి చేరబోతున్నారట మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి. ఈయన మంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలిసిన సంగతే. ఫిరాయింపుకు పాల్పడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి అయ్యారు. అంతటితో ఆగక నిస్సిగ్గు రాజకీయం ఎంతో చేశారు.

తనకూ, తన ఒకప్పటి శత్రువు రామసుబ్బారెడ్డికి మధ్యన వాటాల పంపకాన్ని ఓపెన్ గానే వివరించిన ఘనుడు ఈయన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదినారాయణ రెడ్డికి భయం మొదలైందని అంటారు జమ్మలమడుగు స్థానికులు. ఆ విషయాన్ని ఆయనే అందరికీ చెప్పుకున్నారట. తాము అక్రమాలు చేసి, వాటాలు పంచుకున్నట్టుగా స్వయంగా చెప్పిన పెద్దమనిషి ఆదినారాయణ రెడ్డి.

అక్రమంగా వచ్చే ప్రతి రూపాయిలోనూ రామసుబ్బారెడ్డికి తనకూ వాటా ఉందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అందుకే తాము రాజీ అయినట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు అలాంటి అక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తే ఆదినారాయణ రెడ్డి పరిస్థితి ఏమిటో వివరించనక్కర్లేదు. అందుకే ఈయన తెలివిగా బీజేపీలోకి చేరుతున్నారట. గతంలో కూడా ఈ మేరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ వ్యవహారం కార్యరూపం దాల్చబోతోందని.. ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరి దేశభక్తుడు, హైందవభక్తుడు కాబోతున్నారని.. ఆయన అవినీతి-అక్రమాలకు అలా కవచం ఏర్పాటు చేసుకుంటున్నారని జమ్మలమడుగు జనాలు అనుకుంటున్నారు!

జగన్ మేనమామపై అసంతృప్తి జ్వాలలు!