చేతగానితనానికి టీడీపీ అందమైన ముసుగు!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతరించిపోయింది. ఎండ్ కార్డు పడిపోయింది. కాదు కూడదు.. తమ పార్టీ ఇంకా బతికే ఉంది అని చాటుకోవాలని వారు ఉత్సాహపడుతుంటారు. అందుకోసం నానా పాట్లు పడుతుంటారు.  Advertisement ఇప్పుడు…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతరించిపోయింది. ఎండ్ కార్డు పడిపోయింది. కాదు కూడదు.. తమ పార్టీ ఇంకా బతికే ఉంది అని చాటుకోవాలని వారు ఉత్సాహపడుతుంటారు. అందుకోసం నానా పాట్లు పడుతుంటారు. 

ఇప్పుడు తెలంగాణలో మునుగోడుకు ఉపఎన్నిక జరుగుతోంటే.. అక్కడ పోటీచేయడానికి కూడా తమకు సత్తా లేదని.. తమ పార్టీ మనుగడలో లేదని టీడీపీ పరోక్షంగా తేల్చి చెప్పేసింది. కానీ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు మాత్రం తమ చేతగాని తనానికి ఒక అందమైన ముసుగు తొడగడానికి ప్రయత్నిస్తున్నారు. మునుగోడులో ఉపఎన్నిక రాజ్యాంగబద్ధంగా జరగడం లేదని, అందువల్లనే తాము అక్కడ పోటీ చేయడం లేదని ఆయన అంటున్నారు. ఇదేదో ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడన్న సామెత చందంగా కనిపిస్తోంది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశానికి సమాధి కట్టడం సంపూర్ణంగా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబునాయుడు పార్టీ ఆఫీసులో కార్యక్రమం, సమీక్ష సమావేశం నిర్వహిస్తే హాజరు కావడానికి కొందరు, ఆన్ లైన్ సమావేశంలో ఫోన్లు ఆన్ చేసుకుని కూచోడానికి కొందరు తప్ప.. పార్టీకి అసలు ఊర్లలో జెండా పట్టుకోడానికి కూడా కార్యకర్తలు లేకుండాపోయారు. 

ఏ పార్టీకైనా ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితి రావొచ్చు గాక.. కానీ ఒకప్పట్లో తెలంగాణలో బ్రహ్మరథమెక్కి ఊరేగిన పార్టీ ఇలా అయిపోవడం తమాషా. కనీసం పార్టీ నిర్మాణం గురించి ఎవ్వరూ శ్రద్ధ పెట్టనేలేదు. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తెరాసలోకి వెళ్లిపోయిన తర్వాత.. నామ్ కే వాస్తేగా బక్కని నర్సింహులు ను పార్టీ అధ్యక్షుడు చేశారు. చేతులు దులుపుకున్నారు. 

కానీ మునుగోడు ఎన్నిక వచ్చేసరికి, నిజం చెప్పాలంటే, బక్కని నర్సింహులుకు కాస్త పార్టీని కాపాడాలనే ఆవేశం వచ్చింది. అందుకే ఎన్నికల్లో తమ పార్టీ కూడా బరిలోకి దిగాలని ఉత్సాహ పడ్డారు. మునిగిపోయే తెలుగుదేశం తరఫున మునుగోడులో నామినేషన్ ఖర్చు పెట్టుకోడానికైనా ఎవరు ముందుకు వస్తారు..? అయినా, ఆయన అభ్యర్థిని కూడా సిద్ధం చేసుకుని.. చంద్రబాబు వద్దకెళ్లారు. కానీ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. తెరాస వ్యతిరేక ఓటు చీలి.. బిజెపి విజయావకాశాలపై ప్రభావం పడితే తన మీద వారు ఆగ్రహిస్తారని బాబు భయపడ్డారేమో తెలీదు. మొత్తానికి పోటీకి దిగలేదు. 

అయితే.. అనవసరంగా, ఈగోకు పోయి చేసిన రాజీనామా వల్ల వచ్చిన ఎన్నికలు అని అంటూ, అవి రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎన్నికలు కాదంటూ.. తాము పోటీచేయడం లేదని బక్కని నర్సింహులు ఇప్పుడు బుకాయిస్తున్నారు. ఇంతకీ ఈ బక్కని ఎవరిని బుకాయించడానికి ఈ మాయమాటలు చెబుతున్నారు.. ఏం సాధించగలం అనే నమ్మకంతో.. అనేది అర్థం కాని సంగతి.