ఈనాడు శ్రీధర్ రాజీనామా వెనుక..

సుప్రసిద్ద పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడుకు రాజీనామా చేసారు. ఈనాడు లేని శ్రీధర్ ను, శ్రీధర్ లేని ఈనాడు ను ఊహించలేము. సుమారు 65 ఏళ్ల వయసున్న శ్రీధర్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈనాడుతో…

సుప్రసిద్ద పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడుకు రాజీనామా చేసారు. ఈనాడు లేని శ్రీధర్ ను, శ్రీధర్ లేని ఈనాడు ను ఊహించలేము. సుమారు 65 ఏళ్ల వయసున్న శ్రీధర్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈనాడుతో మమేకమై వున్నారు. 

గత కొద్ది కాలంగా ఆయన స్పాండలైటిస్ తో బాధపడుతున్నారు. ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆ మధ్యనే కుమారుడి పెళ్లి చేసారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసారని అంటున్నారు. కానీ వేరే కారణాలు వున్నాయని జర్నలిస్ట్ వర్గాల బోగట్టా.

గత ఏడాదినో, అంతకు ముందునో ఆంధ్ర ప్రభుత్వం శ్రీధర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించిందని, దానికి మేనేజ్ మెంట్ అంత సుముఖత వ్యక్తం చేయలేదని ఓ టాక్ వుంది.  

అలాగే ఇటీవల ఈనాడులో నలభై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీధర్ సన్నిహితులు, బంధువులు కాస్త హడావుడి చేసారని తెలుస్తోంది. ఫంక్షన్ లు, వీడీయోలు, బహుమతులు ఇలా హడావుడి జరిగిందని ఇది కూడా మేనేజ్ మెంట్ కు నచ్చలేదని బోగట్టా.

మొత్తం మీద అలా ప్రారంభమైన వ్యవహారం రాజీనామాకు దారి తీసిందని వినిపిస్తోంది. శ్రీధర్ కు వేరే పత్రికల నుంచి మంచి ఆఫర్లు వున్నాయి. అది సహజం కూడా. మరి ఆయన దేంట్లో చేరతారు అన్నది చూడాల్సి వుంది. 

ఎందులోనూ చేరకపోతే, ఓ మంచి కార్టూనిస్ట్ నుంచి ఎంతో సృజన అన్నది ఆగిపోవాల్సి వస్తుంది.