రోజూ వైన్ తాగుతా.. అనసూయ గ్లామర్ సీక్రెట్

హీరోయిన్లు ఎలా గ్లామర్ మెయింటైన్ చేస్తారనే ఉత్సుకత అమ్మాయిలందర్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా వయసు మీద పడి, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంటూ కూడా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న అనసూయ లాంటి అందగత్తె, గ్లామర్…

హీరోయిన్లు ఎలా గ్లామర్ మెయింటైన్ చేస్తారనే ఉత్సుకత అమ్మాయిలందర్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా వయసు మీద పడి, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంటూ కూడా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న అనసూయ లాంటి అందగత్తె, గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.

మొత్తంగా చెప్పకపోయినా తన బాడీకి బాగా కలిసొచ్చిన ఓ పద్ధతిని బయటపెట్టింది అనసూయ. ఆమె రోజూ గ్లాసు రెడ్ వైన్ తాగుతుందట. దాంతో పాటు గుప్పెడు డ్రైఫ్రూట్స్ కూడా తింటుందట. అది తనకు బాగా పనిచేసిందని చెబుతోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.

“రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్, కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. నేను వైన్ మాత్రమే తాగుతాను. దాన్ని అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. గుండెకు మంచిది. అందుకే ఓ గ్లాస్ వైన్ తీసుకుంటాను. ఆకలిని తగ్గించుకోవడానికి తాగుతాను. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను.”

ఉపవాసం చేయడం లాంటివి తనకు నచ్చవంటోంది అనసూయ. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ రెడ్ వైన్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానని చెబుతోంది. అందరికీ ఈ పద్ధతి వర్కవుట్ అవుతుందని చెప్పలేనని.. తనకు మాత్రం వైన్ బాగా పనిచేస్తోందని చెప్పుకొచ్చింది అనసూయ.

అయితే ఒంటికి మంచిదని బాటిల్స్ తో వైన్స్ లాగించేయకూడదని, మితంగా తీసుకోవాలని సూచిస్తోంది. అనసూయ ఇలా చెప్పిందో లేదో వెంటనే లైవ్ లో ఉన్న లేడీ యాంకర్ పొంగిపోయింది. “నేను కూడా తాగుతా.. నేను కూడా ట్రై చేస్తా” అంటూ చెప్పుకొచ్చింది. అదీ సంగతి.

చైనాకి బుద్ధి చెబుదాం

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం