టీడీపీ ఖాళీ.. హైదరాబాద్ లో బాబు ఇంకేం చేస్తారు?

ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో పోటీనే చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. అయితే ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం చంద్రబాబు…

ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో పోటీనే చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. అయితే ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ పరిస్థితి మీద దృష్టి సారించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక తెలంగాణ నేతలకూ అందుబాటులో ఉండబోతున్నట్టుగా ఒక ప్రకటన కూడా చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు నేతలకు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటారేమో కానీ, నేతలు మాత్రం చంద్రబాబుకు అందుబాటులో ఉండేలాలేరు.

తెలంగాణ టీడీపీలో ఇంకా మిగిలిఉండిన తుక్కు బ్యాచ్ కూడా ఇప్పుడు బీజేపీలోకి చేరిపోతూ ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ టీడీపీ నుంచి ముఖ్యనేతలంతా వేరే పార్టీల్లోకి చేరిపోయారు. కుదిరిన వారు టీఆర్ఎస్ లోకి, కుదరని వారు కాంగ్రెస్ లోకి చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల నాడే టీడీపీ తెలంగాణ చిత్తు అయ్యింది. చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తే ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిన సంగతే.

ఇక లోక్ సభ ఎన్నికల్లో పోటీనే చేయలేకపోయారు. అయినప్పటికీ ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం హైదరాబాద్ లో మకాం పెట్టేందుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ ఉద్ధరణ అనే ఎజెండాను పెట్టుకున్నట్టుగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ నామమాత్రంగా కూడా ఉండేలాలేదు. గతంలో జగన్ హైదరాబాద్ లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు నానామాటలు అన్నారు. ఇప్పుడు తనే హైదరాబాద్ లో మకాం పెట్టేశారు. ఇక ఎలాంటి సాకులు చెప్పి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండటాన్ని సమర్థించుకుంటారో చూడాలని పరిశీలకులు అంటున్నారు.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..