పాడి ఆవు కాదు.. కొమ్ములతో కుమ్మేసిన పాలకుడు

పాలిచ్చే ఆవును(టీడీపీ) కాదని తన్నే దున్నపోతును (జగన్‌పార్టీని)కోరికోరి తెచ్చుకున్నారని సాక్షాత్తు చంద్రబాబే ప్రజలపై మండిపాటును ప్రదర్శించారు.వాస్తవానికి ఈ సామెత జుగుప్సకరమైనది. మాస్‌ జనాల్లో ఈసామెత బూతుతో రంగరింపబడి వినిపిస్తుంది. ఆసామెతను ఎవరు వాడాలను కున్నా…

పాలిచ్చే ఆవును(టీడీపీ) కాదని తన్నే దున్నపోతును (జగన్‌పార్టీని)కోరికోరి తెచ్చుకున్నారని సాక్షాత్తు చంద్రబాబే ప్రజలపై మండిపాటును ప్రదర్శించారు.వాస్తవానికి ఈ సామెత జుగుప్సకరమైనది. మాస్‌ జనాల్లో ఈసామెత బూతుతో రంగరింపబడి వినిపిస్తుంది. ఆసామెతను ఎవరు వాడాలను కున్నా నలుదిక్కులు చూసి వాడతారు. వాడాక విన్నవారు తెలిసినదే అయినా పడిపడి నవ్వుతారు. సామెతలపై వెలువడ్డ పుస్తకాల్లో ఈ ముతక సామెత వెతికినా కన్పించదు. ఒకవేళ బాబులాంటి రచయిత ఎవరైనా చేరిస్తే బాబులా బూతులను కత్తిరించేసి తన్నేదున్న అని మార్పులు చేస్తారు. కేవలం మాస్‌ జనాల నాలుకలపై నర్తిస్తూ చంద్రబాబు లాంటి 40 ఇయర్సు ఇండస్ట్రీకోసం జీవంపోసుకుని ఉందన్నట్లు ఉంది. అలాంటి  పాలిచ్చే ఆవు సామెతను జనాలపై ప్రయోగానికి చంద్రబాబు కించిత్‌ ఆలోచన చేయకుండా తెగబడ్డారంటే, ఆయన విజ్ఞతను ఏమనుకోవాలి? అనుక్షణం బాబు తను వాడే మాటలను, చేష్టలను తనకుతానే సమర్ధించుకుంటారు. భేష్‌ అని సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారు. అందుకే ఇలా ఏది అనడానికైనా వీసమెత్తు భయపడరు. ఎలాంటి వికృతచేష్టలకైనా (ఉదా:పిల్లనిచ్చిన మామను వెన్నుపొడిచి దించడం) వెనుకాడరు. ఇది ఆయన మనసావాచా నమ్ముకున్న నైజం.

పదేళ్లపాటు ఓటమితో తనకేంటి ఈప్రతిపక్షం గతి. ఇందుకు కారకులు దిక్కుమాలిన అలకా జనాలే అని 2004లో చంద్రబాబు డిసైడ్‌ అయ్యారు. జనాల్లోకి వెడుతూ వారిపై విషపు చూపులు చూస్తూ నోటికి వచ్చిన హామీల వర్షం కురిపిస్తున్నప్పుడు వారిలో ఆశలను కండ్లారచూసారు. ఈసారి ఓటేసి చూడండి. నింగిలో చుక్కలు ప్రతిఒక్క ఓటర్‌ లెక్కించేలా చేస్తానో? లేదో? అన్నట్లుగా అమలు చేయలేని ఉచిత హామీల పరంపరతో కదిలారు. మారానని జనాల్లో పదే పదే చెప్పి పదేళ్లనాటికి తలలూపేలా చేసుకున్నారు. ఒకసారి అవకాశమిస్తే నేనేమిటో చూపుతానని పేదిండ్లకుపోయి వారింట వండినకూడు వారి సత్తుపల్లెంలో తినేస్తూ, ఎంగిలి చేత్తో వారికి ఒకముద్దనోటికి అందించేయడం. ఆ ఫోటోలతో తనంటే పడిచచ్చే పచ్చమీడియాల్లో నిండిపోయారు. రామ, రామ చంద్రన్నలో దర్పం లేదాయే. అహం చావచచ్చింది. మరకల్లేని తెల్లని కాగితమయ్యారు. ఇలాంటి సీనియర్‌ను మనం వదులుకోవడం పెద్దపొరపాటు చేసాం.

పైగా, కుప్ప తెప్పలు సంక్షేమపథకాల హామీలతో వెల్లువెత్తుతున్నాడు. ఓటేకదా ఈసారి వేసేద్దాం. పాపం ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో బిక్కుబిక్కుమంటున్నాడు అని జాలిగొట్టు ప్రజలు మహా జాలితనాన్ని చూపారు. 2014 ఫలితాలవేళ సింగపూర్‌లో మూడోసారి కూడా ఓడిపోతానని, చంద్రబాబు బిక్కుబిక్కు మంటుంటే మనదే హవా. 100సీట్లలో ఆధిక్యతలో దూసుకుపోతున్నాం అని వందిమాగదులు చెవుల్లో హోరెత్తారు. పదేళ్ల పాటు అధికారానికి ఆమడదూరంలోకి నెట్టేసి మూల కూర్చుబెట్టిన జనాలు కుప్పతెప్పలుగావచ్చి నాఉచ్చులో పడ్డారన్నమాట. గెలుపువార్త ఎంత కర్ణపేయంగా ఉందని బాబు ఆనందంలో తేలియాడారు. పాడియావును గెలిపించుకుని తెలుగు జనాలు విభజనలో హీనపడ్డ ఏపీని రక్షించుకున్నారు. చంద్రన్ననే గెలిపించి ఓమంచి పనిచేసారని పచ్చమీడియా పిచ్చగా బాబును నింగిలోకి ఎత్తిచూపి తన పైత్యపు రాతలతో ఆహా! ఓహో!! అని హోరెత్తిపోయింది. కానీ, చంద్రన్న పదేళ్ల ప్రతి పక్షంలోకి నెట్టిన జనాలకు అసురపాలనను చవిచూపాలనే ఆక్షణాలే డిసైడ్‌ అయ్యారు. ఇచ్చిన హామీల గంపను సింగపూర్‌ పురవీధుల్లో డస్టుబిన్‌ల్లో పడేసి ఏపీలో దిగబడ్డారు.

పదేళ్ల తర్వాత ఏపీ ముక్కలై, కుదేలయ్యాక 13జిల్లాలతో సరిపెట్టుకో అని ఈ గెలుపునిచ్చారు దిక్కుమాలిన జనాలు. ఏరైతులనైతే వ్యవసాయం దండగ అని ఎన్నికల మేనిఫెస్టోలో చెబితే, అందులో మంచి తీసుకోకుండా పదేళ్లపాటు ఓటమి చూపి హీనపరిచారు. ఇప్పుడు అదే రైతులు రైతురుణమాఫీ చేస్తానంటే గెలిపించేసారు. డ్వాక్రాలకు రుణమాఫీ చేస్తానన్న హామీని తుంగలోకి ఏమేరకో తొక్కాలో తొక్కేస్తాను. బాబు వస్తే జాబు రాదని తేల్చిచెబుతాను అన్నట్లుగానే బాబు పాలన మొత్తం ఐదేళ్లూ ప్రజావంచనే ఎజండాగా సాగింది. అయితే, స్వంతపార్టీలో, మీడియాలో రైతుల రుణమాఫీపై నిలదీతలు ఎక్కువ కావడంతో తప్పదని కంటితుడుపుగా ఎంతోకొంత ముట్టజెప్పి, రైతులకు రుణమాఫీ చేసేసామోచ్‌ అని ఫ్లెక్సీలతో వాడవాడలా సంబరాలు జరిపేసారు. జనాలు గుడ్లప్పగించి చూడడమే తప్ప కిక్కురుమనలేదు. పుట్టుకతో వచ్చినబుద్ది పుడకలతోనే పోతుంది. మద్యలో ఏమనిషి మారడు గాక మారడని చంద్రబాబు బల్లగుద్ది చెబుతున్నట్టుగా జనాలు కళ్లముందు బాబు పాలన కన్పించసాగింది. కోరికోరి పాడి ఆవులాంటోడు అని తెచ్చుకున్నాం అని ఏపీ జనాలు తలలు పట్టుకున్నారు. 2014లోనే బాబు ఎంత మాత్రం పాడి ఆవు కాదయ్యా!

వాడి అయిన కొమ్ములకు ఉక్కుతొడుగులు తొడుక్కుని పొడిచే దున్నరకం అని డిసైడ్‌ అయ్యారు. అప్పటికి ఇంకా చెడామడా కుమ్మేసే దున్న అని జనాలు అనుకోలేదు. అనుకోపోతే ఎలా? సర్వజనులు పదేపదే అనుకున్నట్లు చేసి తీరుతానన్నట్లు బాబు పాలనలో, క్రౌర్యాన్ని, దౌష్ట్యాన్ని నింపేసి మరీ ముందుకుసాగారు. ఇంతకీ బాబు గెలిపించిన జనాలపై ఎందుకు గుర్రెత్తి ఉన్నారంటే అందుకు బలమైన కారణం  ఉంది. బాబును గెలిపించిన చేత్తో మరో తప్పు ఏపీ ప్రజలు చేసారని బాబు గెలిచినప్పుడే డిసైడ్‌ అయ్యారు. జగన్‌పార్టీని  ప్రతిపక్షహోదా రాకుండా ప్రజలు ఐదోపదో సీట్లుతో ఆపార్టీని తుంగలోకితొక్కి వైకాప వెన్నువిరిచి ఉంటే బావుండేది. పక్కలో బల్లెంలా నిలిపారని గెలిచిననాడే ప్రజల తీరును బాబులో లోపల తప్పుపట్టారు. పైగా, వైకాపా కొత్త సభ్యులు వచ్చీరాని మాటలు చెబుతారంటే ఆరితేరి నోళ్లలా సదావర్తి భూములని, అమరావతికి  రైతులను భయపెట్టి బాబు లాక్కునే తీరును ఎండగడ్తుంటే బాబు తట్టుకోలేకపోయారు. అందుకే ప్రజలపై కినుక వహించి ఇచ్చిన 600 హామీలను గాలికి ధూళికి వదిలేసి ఊదేసారు. ఏరకమైన ఉద్యోగాల నియామకాలు చేయకుండా కరడుగట్టిపోయారు.

పదేళ్ల తర్వాత గెలిచి సీఎం హోదాలో పార్టీ వారితో బాబు తొలి సమావేశంలో 67 సీట్లతో వైకాపా బలమైన ప్రతిపక్షంగా వచ్చింది. అప్రమత్తంగా ఉండాలన్నట్లు చెప్పారు. ఆపార్టీని సభలో మాట్టాడనీయకుండా ఎండగట్టాలి. ఆవెంటనే 13మంది జిల్లా కలెక్టర్లకు మావాళ్ల (పార్టీ కార్యకర్తలు, ఎంఎల్‌ఏలు) పనులు కాదనకుండా చక్కబెట్టమని చెప్పి దేశంలో ఏ సీఎం చేయని సాహసానికి అడ్డుగోలుగా ఒడిగట్టారు. అక్కణ్నించే నరకాసుర పాలన ఆరంభం అయ్యింది. టీడీపీ కార్యకర్తలు అన్ని ఆఫీసుల్లో మాదే చెల్లుబాటయ్యేమాట అన్నట్లు నయానో, భయానో అధికార్లపై విరుచుకు పడడంలో వెనుకాడలేదు. సర్కారు భూములపై కన్నేసి అన్నిమండలాల్లో, పట్టణాల్లో ల్యాండ్‌ మాఫియాకు తెగబడ్డారు. కొంతమంది ఏకంగా చెరువులు కూడా గుటుక్కుమనిపించారు. ఇక నదీతీర గ్రామాల్లో ఇసుక ర్యాంప్‌లపై పెత్తనాలతో అపరకోటీశ్వరులయ్యారు. గాలివాన వచ్చినా పెనుతుపాన్లు వచ్చిన నిజమైన బాధితుడు బాధల్లో మగ్గిపోవాల్సిందే. బాధితుల సాయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలే ఆబగా జుర్రేసారు. 2019నాటి ఎన్నికల మాటేమిటి అనేది బాబు ఆలోచన చేయలేదు. అందిన మేరకు దోపిడీకి తనతోబాటు పార్టీలో చిన్నోడి నుంచి పెద్దోడివరకు తినగలిగినంత తినండన్నట్లు పాలనను జనాల సాక్షిగా సాగించారు.

నంధ్యాల ఉపఎన్నికతో బాబుకు 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఓటమికి గురవుతానని ముందే కూసిన కోయిల కూతలు అదేపనిగా విన్పించాయి. అందుకే నంధ్యాలలో దాదాపు కొన్నివందల కోట్లు వెదజల్లి అతికష్టంతో గెలిచా మనిపించుకున్నారు. ఇలాగే, సాధారణ ఎన్నికల్లో జనాలకు తేనెలో ముంచిన రొట్టెముక్కలు విశిరి గెలవాలనే యోచన ఆనాటి నుంచి పక్కాగా చేసారు. గెలుపాలోచనలను మరింత రంగరించి వేల కోట్లతో ఎన్నికల ముందు రెండు మూడునెలల తాత్కాళిక కరెన్సీ పథకాలను ప్రజలపై గుప్పించారు. దాంతో ఆర్ధిక కరెన్సీ పథకాలు అందుకున్న చేత్తో ఇతగాడికి మళ్లీ గెలిపిస్తే ఇచ్చింది కక్కిస్తాడు, కొమ్ములతో కుమ్మేరకం. ఇచ్చింది బుద్దిగా బొక్కేద్దాం. ఓటు దగ్గర మళ్లీ చేయిచాచి ఏ మిచ్చినా నొక్కేద్దాం అన్నట్లు జనాలు మానసికంగా దృఢ చిత్తులయ్యారు. అందుకే 2019 ఎన్నికల పోలింగ్‌ తేదీల కోసం వేయికళ్లతో సర్వజనులు ఎదురుచూసారు. బాబును ఘోర ఓటమికి గురిచేసి గాని ఏపీ జనాలు శాంతించలేదు.

ఇప్పుడు బాబు ఓటమిని జీర్ణించుకోలేక ''నేను పాడి ఆవును, నన్నెందుకు ఓడించారు? తన్నేదున్నను ఎందుకు గెలిపించారు? అని నిష్టూరంగా హవభావాలు పలికిస్తూ తప్పు పడుతున్నారు. ఆయన 40ఏళ్ల రాజకీయానుభవం ఇదా? జనాలనే తప్పుపట్టే ఏకైక రాజకీయవేత్తగా సర్వజనులు ఈసడించుకున్నారు. ఆపైన ప్రత్యర్ధులు, మీడియా, నోళ్లు వెళ్లబట్టారు. దేశంలోనే ఏపీ ఓటర్‌కి అత్యధికంగా ధరకట్టిన నేత, ఓటుకు నోటు ఇచ్చి గెలవాలనుకునే నేత, ఓటేసి గెలిపిస్తే జనాలపై ఎలాంటి  కర్కశం చవిచూపేలా పాలనను చూపిన నేతగా జనాల దృష్టిలో బాబు నిలిచిపోయారు. రానున్న కాలంలో ప్రజల్లోకి ఏమి చెప్పడానికి వెళ్లగలమని బాబు అండ్‌ బేటా తప్ప టీడీపీ నేతలంతా దారులు వెతుకుతున్నారు.

పార్టీ మునిగిపోతున్న చిల్లులుపడ్డ తెప్ప అని బాబు గ్రహించేసి అంతా కలిసికట్టుగా ఉందామని ఘోరంగా ఓడిన మంత్రులను, ఎంఎల్‌ఏలను పిలిపించి అత్యవసర సమావేశాలు పెడుతున్నారు. ఓట్లేయలేదని టీడీపీ వారి ఇల్లు వైకాపా కార్య కర్తలు కూల్చేస్తున్నారు. అపరిమితంగా దాడులు దంచేస్తున్నారు. రెండునెలల్లో పులివెందుల పంచాయితీలు ఆరంభం అయ్యాయి. సామాన్యులకు రక్షణ కరువయ్యింది. ఇలా బాబు ప్రసంగాలకు ఓటమితో బిక్కుబిక్కుమంటున్న నేతలు తలలు పట్టుకున్నారు. ఇవేం జీవంలేని ఆరోపణలు? ఇలాంటివి నమ్మేస్థితిలో ఏవర్గం జనాలుంటారు? అయ్యో! బాబు తీరుమరి మారదా అని నొసలు నొక్కుకోసాగారు. కొత్తసర్కారు ఇలావస్తే అలా జనాల్లోకి వెడతామా? జనాలు రారమ్మని స్వాగతించేది లేదు. ఇలాంటి నమ్మునమ్మకపో మాటలు వినేస్థితిలో ప్రస్తుతం ఏపీ జనాలు లేరు. మనపార్టీ ఐదేళ్లూ చేసిన నిర్వాకమే ఈనాడు మనోటమికి ప్రభల కారణం. ఐదేసిసార్లు ఓడినోళ్లకు పదవులు కట్టబెట్టారు. పార్టీని నమ్మినోళ్లకు మొండిచేయి చూపారని పార్టీ సీనియర్లు కదంతొక్కి మరీ బాబు ముందు వక్కాణించారు.

ఆనాడు బాబు అధికార దూకుడుకు కళ్లెంవేయలేక పోయినా ఇప్పుడు చేష్టలుడిగినప్పుడైనా మనఆంతర్యం చెప్పాల్సిందే, పాడిఆవుకు పచ్చగడ్డి కరిపించాల్సిందే అన్నట్లు చెప్పేసి బాబుకు బిక్కముఖం వేయించారు. లేకుంటే రాక్షసపాలనతో వేగలేక ఓటమిపాలు చేసిన జనాల్లోకి ఇప్పుడు వెళ్లడం సరికాదు. బాబు నాయకత్వంలో పార్టీ ఇక దినదినం ప్రవర్ధమానం కాలేదు. ఆయన ఈజన్మలో మారడు. నోరువిప్పితే వివాదస్పదమే. ప్రజలను తప్పుపట్టడం అనేది పార్టీని హీనపరిచేదే. నమ్మలేని ఆరోపణలతో రాజకీయాలు చేసే పాతతరం రాజకీయముదురు. కనుక అతడో అడుగంటిన జలాశయమే. అందులో నీళ్లు తాగాలనుకోవడం సరికాదని ఎవరికి వారే అనుకున్నారు. ముందుగతులు ఆలోచించిన పార్టీ మహా సీనియర్‌ గోరంట్ల కరాకండిగా చెప్పారు. తను పదవికి రాజీనామా చేస్తాను. యువతతో నింపండని బాబుకు డైరెక్టుగా, ఇన్‌డైరెక్టుగా చెప్పకనే చెప్పారు. ఇక బాబు సారధ్యం పార్టీకి శుద్ధదండగ. వచ్చీరాని మాటలు మాట్లాడే లోకేష్‌ లేదా ఎన్‌టీఆర్‌ వారసుల్లో వెతికితే ఎవరో ఒకరు కన్పించకపోరు అనే ఆలోచన ఈసరికే ఆపార్టీలో ముసురుకుంది.
-యర్నాగుల సుధాకరరావు

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?