ఆ హీరోతో పెళ్లని రూమర్ సృష్టించండన్న హీరోయిన్!

'మీ గురించి ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం రాయాలి?' అని అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తిదాయకమైన రీతిలో సమాధానం ఇచ్చింది నటి జరీన్ ఖాన్. 'సల్మాన్ ఖాన్ తో నాకు పెళ్లి…

'మీ గురించి ఏదైనా రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఏం రాయాలి?' అని అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తిదాయకమైన రీతిలో సమాధానం ఇచ్చింది నటి జరీన్ ఖాన్. 'సల్మాన్ ఖాన్ తో నాకు పెళ్లి అని రూమర్ సృష్టించి స్ప్రెడ్ చేయండి..' అని సరదాగా వ్యాఖ్యానించింది ఈ హీరోయిన్. అందుకు తగ్గట్టుగానే జరీన్ విషయంలో బాలీవుడ్ మీడియా కథనాలు ఇచ్చింది.

'సల్మాన్ ను జరీన్ పెళ్లి చేసుకోబోతోందా?', 'సల్మాన్ – జరీన్ ఖాన్ ల పెళ్లి వెనుక అసలు కథ..' అంటూ కథనాలు ఇస్తోంది బాలీవుడ్ మీడియా. జనాలు దాదాపుగా మరిచిపోతున్న దశలో జరీన్ ఖాన్ ఇలా వార్తల్లోకి వచ్చింది. మీడియా అడగగానే ఆసక్తిదాకయమైన రూమర్ ను అందించింది జరీన్ ఖాన్.

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కాదు దాదాపు దశాబ్దం కిందటే జరీన్ ఖాన్ విషయంలో ఇలాంటి రూమర్లు వచ్చాయి. సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన నటి జరీన్ ఖాన్. 'వీర్' అనే భారీ అంచనాల సినిమాతో జరీన్ ను పరిచయం చేశాడు సల్మాన్. అచ్చం కత్రినాకైఫ్ ఫీచర్స్ తో అప్పట్లో జరీన్ కైపెక్కించింది.

అయితే 'వీర్' సినిమా బోర్ అనిపించింది. డిజాస్టర్ గా నిలిచింది. దీంతో జరీన్ కెరీర్ అంత ఊపందుకోలేదు. ఆ తర్వాత హాట్ హాట్ గా నటిస్తూ జరీన్ అడపాదడపా సినిమాల్లో మెరుస్తోంది. సల్మాన్ కూడా ఈమెను ఆ తర్వాత పెద్దగా ఆదుకున్నట్టుగా కనిపించలేదు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?