సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై చాలా విషాదభరితంగా రియాక్ట్ అవుతూ ట్వీట్లు పెట్టిన వారిలో అలియాభట్, కరణ్ జొహార్ లాంటి వాళ్లున్నారు. అయితే వాళ్ల ట్వీట్ల పై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుశాంత్ బతికున్నప్పుడు ఈ ఎలైట్ క్లబ్ లోని వాళ్లంతా అతడిని వెలివేసినట్టుగా వ్యవహరించారని, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని వీళ్లపై మండిపడ్డారు. అంతే కాదు.. సోషల్ మీడియాలో వారి ఫాలోయింగ్ కూడా బాగా తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది.
వారసత్వంతో సినిమాల్లోకి వచ్చి, వారసుల మధ్యన హల్చల్ చేస్తున్న అలియాభట్, స్టార్ల వారసులకు మాత్రమే అవకాశాలు ఇస్తాడు, వాళ్లనే మోస్తుంటాడు అనే పేరున్న కరణ్ జొహార్ ను నెటిజన్లు ఇప్పుడు బాగా హేట్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో వారిని ఫాలోయిన వారు కూడా ఇప్పుడు అన్ ఫాలో కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని లక్షల మంది వీరిని ఆన్ ఫాలో చేసినట్టుగా సమాచారం.
అలియా భట్ అయితే ఏకంగా నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది ఫాలోయర్లను కోల్పోయిందట. ఆమె సోషల్ మీడియా ఖాతాలను ఈ మేరకు అంతమంది అన్ ఫాలో చేశారు. ఇక ఆమెతో పోలిస్తే తక్కువ ఫాలోయర్లను కలిగి ఉన్న కరన్ జొహార్ కూడా లక్షా 88 వేల మంది ఫాలోయర్లను కోల్పోయాడట. ఈ వేడిలోనే సల్మాన్ ఖాన్ ను కూడా చాలా మంది అన్ ఫాలో చేశారట. బాలీవుడ్ లో గ్రూప్ ను మెయింటెయిన్ చేస్తున్న వారిలో సల్మాన్ ఖాన్ కూడా ముందున్నాడనే సంగతి తెలిసిందే. సల్మాన్ ఫ్యామిలీపై దర్శకుడు అభినవ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో సల్మాన్ ఫాలోయింగ్ లో కూడా 50 వేల మంది మైనస్ అయ్యారట. మొత్తానికి తాము ఎలాంటి ఆటలు ఆడినా జనాలు తప్పక చూస్తుంటారనే భ్రమ నుంచి స్టార్లు, వారి వారసులు బయటకు రావాల్సిన సమయం ఇదేలాగుంది!