ఇక అది మాత్ర‌మే మిగిలిందంటున్న తాప్సీ

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు సినీ లేడీ సెల‌బ్రిటీల‌ను, ఇత‌ర‌త్రా రంగాల‌కు చెందిన మ‌హిళ‌లకు అసంతృప్తి మిగిల్చింది. త‌మ అస‌హనాన్ని, ఆగ్ర‌హాన్ని వారు ఏ మాత్రం దాచుకోలేదు. నిర్భ‌యంగా వివిధ వేదిక‌ల మీదుగా ప్ర‌క‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.…

ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు సినీ లేడీ సెల‌బ్రిటీల‌ను, ఇత‌ర‌త్రా రంగాల‌కు చెందిన మ‌హిళ‌లకు అసంతృప్తి మిగిల్చింది. త‌మ అస‌హనాన్ని, ఆగ్ర‌హాన్ని వారు ఏ మాత్రం దాచుకోలేదు. నిర్భ‌యంగా వివిధ వేదిక‌ల మీదుగా ప్ర‌క‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యం లో స్టార్ హీరోయిన్ తాప్సీ ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు తీర్పుపై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ప‌న్ను షూటింగ్స్ లో ఆమె బిజీగా ఉన్న‌ప్ప‌టికీ, మ‌హిళ‌ల‌కు సంబంధిన అంశం కావ‌డంతో ఆమె స్పందించ‌కుండా ఉండ‌లేకపోయారు. ముఖ్యంగా మ‌హిళ‌లపై దాడులు, అఘాయిత్యాల‌కు వ్య‌తిరేకంగా తాప్సీ స్పందించే సంగ‌తి తెలిసిందే. అత్యాచారం కేసు విచార‌ణ‌లో భాగంగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు తాజా తీర్పు తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముందు హైకోర్టు తీర్పు, ఆ త‌ర్వాత తాప్సీ స్పంద‌న ఏంటో తెలుసుకుందాం.

భార్య ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా శృంగారం చేస్తే చట్ట ప్రకారం నేరం కాదని, అది అత్యాచారం కిందికి రాదంటూ ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని హైకోర్టు తన తీర్పులో స్ప‌ష్టం చేయ‌డం విశేషం. ఈ తీర్పుపై తాప్సీ త‌న అస‌హ‌నాన్ని ట్విట‌ర్ వేదిక‌గా ఏ విధంగా వ్య‌క్తం చేశారంటే…

‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ తాప్సీ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఒక్క వాక్యంలో చెప్పిన‌ప్ప‌టికీ… అందులో ఎంతైనా అర్థం చేసుకోవ‌చ్చంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం తాప్సీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.