అప్పుడు చేజారింది.. ఇప్పుడు అదే హీరోతో సినిమా

పరిశ్రమలో కొన్ని అవకాశాలు ఎందుకు చేజారిపోతాయో, కొన్ని అవకాశాలు ఎలా వెదుక్కుంటూ వస్తాయో అస్సలు ఊహించలేం. అలా జరిగిపోతుంటాయంతే. హీరోయిన్ ఆనంది విషయంలో కూడా అదే జరిగింది. జాంబీరెడ్డి సినిమాతో మెరిసిన ఈ ముద్దుగుమ్మ,…

పరిశ్రమలో కొన్ని అవకాశాలు ఎందుకు చేజారిపోతాయో, కొన్ని అవకాశాలు ఎలా వెదుక్కుంటూ వస్తాయో అస్సలు ఊహించలేం. అలా జరిగిపోతుంటాయంతే. హీరోయిన్ ఆనంది విషయంలో కూడా అదే జరిగింది. జాంబీరెడ్డి సినిమాతో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా సుధీర్ బాబు సరసన శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేసింది.

నిజానికి జాంబీరెడ్డి కంటే ముందు సుధీర్ బాబు సినిమాలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. కానీ అది కాస్తా చేజారింది. అలా చేజారిన అవకాశాన్ని ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో అందిపుచ్చుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబు బయటపెట్టాడు.

“ఆనందితో ఇప్పుడు కాదు, ఎప్పుడో సినిమా చేయాల్సింది. ప్రేమకథాచిత్రమ్ లో ముందుగా ఆనందినే హీరోయిన్ గా అనుకున్నాం. కానీ ఆఖరి నిమిషంలో నందితను తీసుకున్నాం. అయితే ప్రేమకథాచిత్రమ్ తమిళ్ రీమేక్ లో ఆనంది చేసింది. అలా ఆమెతో వర్క్ చేసే అవకాశం మిస్సయింది. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ లో ఆనందిని తీసుకున్నాం. ఆమె తెలుగమ్మాయి అవ్వడం ఈ సినిమాకు ఇంకా ప్లస్ అయింది.”

ఇలా ఆనంది ఎంపిక వెనక అసలు విషయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. మొత్తానికి ప్రేమకథాచిత్రమ్ లో అవకాశం చేజార్చుకున్న ఈ హీరోయిన్, ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో సుధీర్ బాబు సరసన నటించే అవకాశం అందుకుందన్నమాట.