చంద్రబాబును ఇళ్లు ఖాళీ చేయించిన కృష్ణానది!

ఎంతసేపని బుకాయించగలరు? ప్రకృతితో ఆటలు ఆడుతూ.. మళ్లీ అందరి మీదా ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తీరా నది పొంగిపొర్లడంతో ఇసుక మూటలు వేసి ఆపాలని చూస్తున్నారట. ఫస్ట్ ఫ్లోర్ లోని సామాన్లను రెండో…

ఎంతసేపని బుకాయించగలరు? ప్రకృతితో ఆటలు ఆడుతూ.. మళ్లీ అందరి మీదా ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తీరా నది పొంగిపొర్లడంతో ఇసుక మూటలు వేసి ఆపాలని చూస్తున్నారట. ఫస్ట్ ఫ్లోర్ లోని సామాన్లను రెండో ఫ్లోర్ కు తరలించారట. అంతకన్నా ముందే పార్కింగ్ లో ఉన్న చంద్రబాబు కాన్వాయ్ ను మరో చోటకు పంపించేశారట!

ఇదీ చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద తాజా పరిస్థితి అని తెలుస్తోంది. నదీ పరివాహాక ప్రాంతాల్లో అక్రమ కట్టడాల గురించి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చాలామంది ఇష్టానుసారం మాట్లాడారు. అడ్డగోలుగా మాట్లాడారు. చంద్రబాబును సమర్థించడానికి పడరాని పాట్లు పడ్డారు. నేజనల్ ఎన్విరాన్ మెంటల్ బోర్డు ఇచ్చిన నోటీసులు కూడా వాళ్లకు విలువైనవిలా అనిపించలేదు.

అందుకే స్వయంగా కృష్ణానది రంగంలోకి దిగింది. తన పరివాహక ప్రాంతం ఎంతవరకూ ఉందో తేల్చి చెప్పింది. మర్యాదగా తనకు దారి ఇస్తే మంచిదని ఆక్రమణదారులకు తేల్చి చెప్పింది. అందుకే ఇప్పుడు తప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ ను ఖాళీ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా కరకట్ట నివాసాన్ని వదిలి హైదరాబాద్ చేరుకున్నారట. తన ఇంటిని చుట్టుముట్టిన నదీ ప్రవాహం ధాటికి చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారట.

ఇదీ పరిస్థితి. ఇదీ కథ. కరకట్ట నివాసాన్ని కాపాడుకోవడానికి కోర్టుకు ఎక్కి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కృష్ణానదే తన పరివాహక ప్రాంతం ఏమిటో చాటి చెప్పింది. మరి ఇప్పుడు కోర్టులు చంద్రబాబుకు వత్తాసు పలుకుతాయా? పంతానికి పోయి చంద్రబాబు నాయుడు అక్రమనిర్మాణంలోనే కొనసాగుతారా? 

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!