ఒకే విడతలో హిమాచల్ పోలింగ్‌!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం…

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

నవంబర్ 12న ఓటింగ్ జ‌రిగితే ఎన్నిక‌ల‌ ఫలితాలు డిసెంబర్ 8న ప్ర‌క‌టించనున్నాయి. నామినేష‌న్ల దాఖ‌లు అక్టోబ‌ర్ 17న ప్రారంభ‌మై అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు కొన‌సాగ‌నుందంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లో 55 లక్షల మందికి పైగా ప్రజలు ఓటు వేయడానికి అర్హులని, వారిలో 1.86 లక్షల మంది మొదటిసారి ఓటర్లుగా ఉన్నారని, 1.22 లక్షల మంది 80 ఏళ్లు పైబడిన వారేనని ఈసీ ప్ర‌క‌టించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, అందరినీ కలుపుకొని ఓటింగ్  జ‌ర‌గ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఛీఫ్ ఎల‌క్ష‌న్ తెలిపింది. హిమాచల్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది.