రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ఈగిల్’. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమా షూట్ ఎక్కువ భాగం లండన్, ఆ చుట్టుపక్కల జరిగింది.
వాస్తవానికి సినిమా మొత్తం పూర్తయిపోయింది. అయినా సినిమాను నేరుగా సంక్రాంతి బరిలోకి దింపాలని అలా వుంచేసారు. ఇలాంటి నేపథ్యంలో లోకల్ గా చేద్దామనుకున్న చిన్న ప్యాచ్ వర్క్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు, మళ్లీ ఆ మాత్రం అడ్జస్ట్ మెంట్ ఎందుకు, ఏకంగా లండన్ లోనే చేసేద్దామని డిసైడ్ అయ్యారట.
కానీ విడుదలకు బోలెడు సమయం వున్నందున ఆ చిన్న వెలితి కూడా ఎందుకు అని, లండన్ లోనే షూట్ చేసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు యూనిట్ లండన్ కు బయల్దేరి వెళ్లింది. రవితేజ ఒకటి రెండు రోజుల్లో వెళ్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రవితేజ నుంచి రాబోతున్నాయి. ఈ రెండూ కూడా ఆయన రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు కాదు.
దసరాకు వస్తున్న టైగర్ నాగేశ్వరరావు ఓ గజదొంగ బయోపిక్. ఈగిల్ పక్కా థ్రిల్లర్. అందువల్ల ఈ రెండు సినిమాల కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.