హీరోయిన్లు సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటారు, నిశ్చితార్థం కూడా అంతే సీక్రెట్ గా జరిగిపోతుంది. అయితే హీరోలు మాత్రం ఈ విషయంలో గోప్యత మెయింటైన్ చేయరు.
ఫలానా అమ్మాయితో పెళ్లి, నిశ్చితార్థం అంటూ ఘనంగా ప్రకటించుకుంటారు. అయితే హీరో కార్తికేయ మాత్రం ఈ విషయంలో హీరోయిన్లను ఫాలో అయ్యాడు. ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ హీరో ఆ విషయాన్ని అస్సలు బయటపెట్టలేదు.
హీరో కార్తికేయ నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై అప్పుడే మీడియా ఆరాలు కూడా తీసింది. అయితే వాళ్లకు ఓ విచిత్రమైన సమాధానం ఎదురైంది. కార్తికేయ ప్రస్తుతం ఆమెరికాలో ఉన్నాడట, తిరిగొచ్చిన తర్వాత ప్రకటన చేస్తాడట.
అమెరికా పర్యటనకు, నిశ్చితార్థానికి సంబంధం ఏంటో అర్థంకాక మీడియా జనాలు తలగోక్కుంటున్నారు. రేపు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని యూరోప్ పర్యటనకు వెళ్తాడేమో అంటూ జోకులేస్తున్నారు. ఈ సెటైర్లు సంగతి పక్కనపెడితే, కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది వాస్తవం. తాజా సమాచారం ప్రకారం, ఇది పెద్దల కుదిర్చిన పెళ్లి అని తెలుస్తోంది.
రీసెంట్ గా చావుకబురు చల్లగా సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చాడు కార్తికేయ. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో హీరో అజిత్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు.