ప్రజలకే కాదు, నేతలను కూడా ఒకేరీతిలో ట్రీట్ చేశారు చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల హామీలను 2019 ఎన్నికల ముందు ఎంతోకొంత అమలు చేసినట్టుగా కలరింగ్ ఇచ్చిన పాలన చంద్రబాబుది. కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి నిధి.. వంటివన్నీ కూడా కేవలం ఎన్నికల గిమ్మిక్కులుగా మార్చిన ఘనత చంద్రబాబుది.
ఇప్పుడు అవే పథకాల గురించి చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీ నేతలంతా లెక్చర్లు దంచికొడుతూ ఉన్నారు. తాము అమలు చేసిన పథకాలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ పథకాలను ఎప్పుడు అమలు చేశారు, ఎలా అమలు చేశారు, ఎందుకు అమలు చేశారు? అనే అంశాల గురించి ప్రజలు మరిచిపోయి ఉంటారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ల ఫీలింగు.
ఇక నేతలను కూడా అలాగే ట్రీట్ చేశారు. అందులో భాగంగా2014లో టీడీపీలోకి చేరిన అనేకమంది నేతలకు మళ్లీ ఎన్నికలు దగ్గరయ్యేంత వరకూ ఎలాంటి పదవులనూ ఇవ్వలేదు. అలాంటి నిర్లక్ష్యానికి గురయిన వాళ్లలో చల్లా రామకృష్ణా రెడ్డి ఒకరు. ఆయనకు చివర్లో ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చారు.
ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవిని ఇచ్చినట్టున్నారు. ఆర్టీసీ చైర్మన్ గా వేరొకరికి అవకాశం ఇచ్చి, రీజినల్ చైర్మన్ గా చల్లాకు పదవి ఇచ్చారు. అప్పుడే ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అలాచేరిన చల్లాకు కొన్ని నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి లభిస్తూ ఉండటం గమనార్హం. ఎన్నికలు అయ్యాకా తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ నామినేషన్లలోనే చల్లాకు అవకాశం లభించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ధ్రువీకరించింది.
ప్రజలకు తను ఇచ్చిన హామీలను జగన్ పీఠం ఎక్కిన వెంటనే అమలు చేయడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నారు. అదే సమయంలో నమ్మి వచ్చిన నేతలకు కూడా ఆదిలోనే అవకాశం ఇస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబుకు, జగన్ కు ఉన్న తేడాల్లో ఇది కూడా ముఖ్యమైనదే!