జలకళ.. పదేళ్ల రికార్డు!

2009 తర్వాత కృష్ణానదికి ఈ స్థాయి వరద రావడం ఇదే తొలిసారి అని అంటున్నాయి కేంద్ర జలవనరుల శాఖ గణాంకాలు. కృష్ణానది పది గేట్లు ఎత్తడం, ఇంత భారీస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడం…

2009 తర్వాత కృష్ణానదికి ఈ స్థాయి వరద రావడం ఇదే తొలిసారి అని అంటున్నాయి కేంద్ర జలవనరుల శాఖ గణాంకాలు. కృష్ణానది పది గేట్లు ఎత్తడం, ఇంత భారీస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ చోటు చేసుకునలేదని జలవనరుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద చుట్టుముట్టింది. మహాభళేశ్వర్ పర్వతాల్లో కురిసిన అత్యంత భారీ వర్షాల ధాటికి 
ముందుగానే ఆల్మట్టి, నారాయణ్ పూర్ జలాశయాల గేట్లు ఎత్తేశారు.

రానున్న వరద నీటిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం గేట్లు ఎత్తేసింది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్ కు భారీ వరద లభ్యమైంది. పదిరోజుల నుంచి ఏకధాటిగా కొనసాగుతున్న వరద పుణ్యమా అని ప్రాజెక్టు నిండటంతో పాటు దాని మీద ఆధారపడిన సాగునీటి ప్రాజెక్టులకు కూడా భారీగా నీటి విడుదల జరుగుతూ ఉంది.

హంద్రీనీవా, మచ్చుమర్రి వంటి ప్రాజెక్టులకు కూడా ఇప్పటికే నీటి విడుదల కొనసాగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతానికి ఇది ఎంతోకొంత ఊరటను ఇచ్చే అంశమే. అయితే సీమకు మరింతగా నీటి విడుదల అవసరం ఉందని ఆ ప్రాంతవాసులు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టు నుంచి నీటినంతా దిగువకు విడుదల చేసి తమకు అన్యాయం చేస్తున్నారనే భావన వ్యక్తం అవుతూ ఉంది.

అయితే హంద్రీనీవా వంటి ప్రాజెక్టు ఎంతోకొంత అయినా పూర్తి కావడంతో అక్కడి వరకూ అయినా ఈ సంవత్సరం నీరు చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు సంవత్సరాల్లో కేవలం కాలువలు సాగించడం, అక్కడక్కడ చెరువులు మాత్రమే నింపారు. ఈ సంవత్సరం రాయలసీమలో ఆయా చెరువుల ఆయకట్టుకు కూడా నీరు విడుదల చేస్తారని ఆశించాలి.

ఇప్పుడప్పుడే ఎగువ ప్రాంతంలో వర్షాలు కూడా ఆగేలాలేవు. దసరా సీజన్ వరకూ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. దీంతో మరింత భారీస్థాయిలో నీటి లభ్యత ఖరారు అయినట్టే. 

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్