మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే హడావుడి మరో ఒక రోజులో షురూ కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల టైటిళ్లు బయటకు వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.
అనిల్ సుంకర నిర్మాతగా చేయబోయే వేదాలం రీమేక్, బాబీ డైరక్షన్ లో చేయబోయే సినిమా, మోహన్ రాజా డైరక్షన్ లోని లూసిఫర్ రీమేక్. ఇవీ ఆ మూడు సినిమాలు
ఈ మూడు సినిమాలకు మూడు టైటిళ్లు ఫిక్స్ అయ్యాయని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినవచ్చాయి. వేదాలం రీమేక్ కు భోళాశంకర్ అనే పేరు పిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాబీ సినిమాకు అయితే వాల్తేర్ వీరయ్య అనే చిత్రమైన టైటిల్ వినిపిస్తోంది.
భోళాశంకర్, గాడ్ ఫాదర్ టైటిళ్లు పక్కా ఫిక్స్ అని, వాల్తేర్ వీరయ్య అన్నది ఇంకా డిస్కషన్ లో వుందని తెలుస్తోంది. ఏ విషయమూ మరో రోజులో వెల్లడయిపోతుంది.