మోదీజీ! త్వరగా అనగా కొన్నేళ్ల తర్వాతేనా?

370వ అధికరణం రద్దయింది, కాశ్మీరు నుంచి లడాఖ్ వేరుపడింది. ప్రస్తుతానికి రెండూ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. సవరణల ప్రకారం… జమ్మూకాశ్మీరుకు ఎన్నికలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన…

370వ అధికరణం రద్దయింది, కాశ్మీరు నుంచి లడాఖ్ వేరుపడింది. ప్రస్తుతానికి రెండూ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. సవరణల ప్రకారం… జమ్మూకాశ్మీరుకు ఎన్నికలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ… దీనికి సంబంధించి తన అభిప్రాయాలు అనేకం వెల్లడిస్తూ… పనిలో పనిగా త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని కూడా అన్నారు.

కానీ వాస్తవంలో మోడీ చెప్పినటువంటి ‘త్వరలోనే’ అనే పదానికి అర్థం.. ‘కొన్ని సంవత్సరాల తర్వాత’ అనే అనుకోవాల్సి వస్తోంది. నరేంద్రమోడీ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీరుకు చాలా ప్రయోజనాలు కలుగుతాయంటూ ఏకరవు పెట్టారు. ఉగ్రవాదం అంతం అవుతుందని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయని, విద్యావకాశాలు మెరుగుపడతాయని, టూరిజం అద్భుతంగా విలసిల్లుతుందని, భారతీయ చలనచిత్ర పరిశ్రమ మళ్లీ అక్కడ షూటింగులు ప్రారంభిస్తుందని ఇలా అనేక విషయాలను ఆయన చెప్పుకొచ్చారు.

కశ్మీర్ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. ముందు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా కార్యరూపం దాల్చాల్సి ఉంది. తొలుత కాశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ప్రస్తుతం విపరీతమైన సీఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య ఆ ప్రాంతం ఉంది. ఈ కేంద్రప్రభుత్వం హామీ ఇస్తున్నట్లుగా అక్కడ ఉపాధి, విద్యావకాశాలు మెరుగుపడడం లాంటివన్నీ జరగాలి. ఇవన్నీ హఠాత్తుగా జరిగిపోయే అంశాలు కాదు. సమయం అవసరం. నిదానంగా ఒక్కొక్కటీ పూర్తవుతాయి.

అన్నీ జరిగితే తప్ప.. వాతావరణం కుదుటపడితే తప్ప… అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం ముందుకు వస్తుందని అనుకోనవసరం లేదు. పైగా జాతీయ ప్రయోజనాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నప్పటికీ, ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చే సమయానికి ప్రభుత్వాలు, పార్టీలు రాజకీయ ప్రయోజనాలను కూడా చూసుకుంటాయనేది సత్యం. మోడీ సర్కారు అందుకు అతీతం ఎంతమాత్రమూ కాదు. అందుకే మోడీ ఇప్పుడు త్వరలోనే అన్నప్పటికీ.. కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక