నాగ్ – ఓనర్ ఆఫ్ ఓన్ ఫ్లయిట్

హీరో నాగార్జున జీవితాన్ని ఆస్వాదించినట్లు చాలా తక్కువ మంది వుంటారు. చాలా హ్యపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు. పిల్లలతో సమానంగా హుషారుగా వుంటారు. అదే సమయంలో సక్సెస్ ఫుల్ ఎంటర్ పెన్యూర్ గా…

హీరో నాగార్జున జీవితాన్ని ఆస్వాదించినట్లు చాలా తక్కువ మంది వుంటారు. చాలా హ్యపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు. పిల్లలతో సమానంగా హుషారుగా వుంటారు. అదే సమయంలో సక్సెస్ ఫుల్ ఎంటర్ పెన్యూర్ గా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. కేవలం సినిమా రంగానికి పరిమతం కాకుండా, రియల్ ఎస్టేట్, హోటల్, ఇలా చాలా రంగాల్లో ఆయన పెట్టుబడులు పెడుతుంటారు. 

లేటెస్ట్ గ్యాసిప్ ఏమిటంటే, నాగ్ తన కుటుంబానికి స్వంత ఫ్లయిట్ ను కొనుగోలు చేసారనో? చేసే ప్రయత్నాల్లో వున్నారని అన్నది. నాగ్ తన కుటుంబానికి అంటూ స్వంతంగా ఓ విమానం వుండాలని అనుకుంటున్నారు. ఆ మధ్య చెన్నయ్ కు తన సోదరుడి ఇంటి ఫంక్షన్ కు వెళ్లినపుడే కొన్నారనో, కొనే ఆలోచన చేసారనో తెలుస్తోంది. 

కొన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కాదు, కొనే ఆలోచనలో వున్నారు. మోడళ్లు, ఇతరత్రా వ్యవహారాల గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు అని నాగ్ సన్నిహితవర్గాల బోగట్టా. ఇప్పటికే పవన్, చిరు వీళ్లంతా ఎక్కడికయినా వెళ్తే చార్టర్ ఫ్లయిట్ ల్లో వెళ్తున్నారు. ఇకపై నాగ్ కూడా అన్నమాట.

జగన్ గారికి చాలా థాంక్స్

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు