తెలుగుదేశం చేయలేనిది జగన్ చేస్తారా ?

అయిదేళ్ళ జమానాలో తెలుగుదేశం విశాఖని సినీ రాజధానిగా చేస్తామంటూ పొద్దుపుచ్చింది. ఈ లోగా కాలం గిర్రున తిరిగి విపక్షంలో కూర్చుంది. ఇపుడు చాన్స్ వైసీపీది. Advertisement టాలీవుడ్ ని విశాఖకు తీసుకువస్తామని వైసీపీ మంత్రులు…

అయిదేళ్ళ జమానాలో తెలుగుదేశం విశాఖని సినీ రాజధానిగా చేస్తామంటూ పొద్దుపుచ్చింది. ఈ లోగా కాలం గిర్రున తిరిగి విపక్షంలో కూర్చుంది. ఇపుడు చాన్స్ వైసీపీది.

టాలీవుడ్ ని విశాఖకు తీసుకువస్తామని వైసీపీ మంత్రులు అంటున్నారు. దానికి తగిన యాక్షన్ ప్లాన్ కూడా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ రూపొందించారు. విశాఖలో ఆల్రెడీ రామానాయుడు స్టూడియో ఉంది. విశాఖ సాగర తీరానికి ఆనుకుని పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు అనుమతులు ఇవ్వాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది.

దీని మీద అప్పట్లోనే అంటే టీడీపీ హయాంలోనే ప్రయత్నాలు జరిగాయి కానీ అవి ఎటూ కాకుండా పోయాయని ఆ పార్టీ నేతలు తాపీగా బాధ పడుతున్నారు.  మరి టాలీవుడ్ ని ఏపీకి రావాలని బలంగా కోరుతున్న వైసీపీ సర్కార్ విశాఖలో స్టూడియోల నిర్మాణానికి కనుక అవసరమైన అనుమతులు ఇస్తే అది రికార్డే అవుతుంది.

మూడు దశాబ్దాలుగా విశాఖలో సినీ రాజధాని కల నిజమవుతుంది కూడా. ఎపుడో చెన్నారెడ్డి సీఎం గా ఉన్నపుడు కొందరు సినీ పెద్దలకు విశాఖ, భీమిలీ తీరంలో భూములు ఇచ్చారు. ఆ తరువాత మళ్ళీ అంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసింది లేదని అంటున్నారు. ఇపుడు కనుక జగన్ ముందుకు వచ్చి సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇస్తే మాత్రం విశాఖకు  పాలనా రాజధానితో పాటే సినీ రాజధాని కూడా ఒకేసారి రావడం ఖాయం అంటున్నారు.

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు