క్రిష్ కొండపొలం డేట్ ఫిక్స్

విజువల్ వండర్ గా డైరక్టర్ క్రిష్ తయారుచేస్తున్న కొండపొలం సినిమా విడుదల డేట్ ను లాక్ చేసారు. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదలవుతుంది. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఇది.  Advertisement రకుల్…

విజువల్ వండర్ గా డైరక్టర్ క్రిష్ తయారుచేస్తున్న కొండపొలం సినిమా విడుదల డేట్ ను లాక్ చేసారు. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదలవుతుంది. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ఇది. 

రకుల్ ప్రీత్ సింగ్ కధానాయిక. రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ టైమ్ లో చకచకా రెడీ అయిపోయింది. కానీ సినిమాకు గ్రాఫిక్స్ ఎక్కువ కావడంతో కాపీ రెడీ కావడానికి ఇంతకాలం పట్టింది.

వాల్ట్ డిస్నీ సినిమాల తరహాలో విజువల్ ఎఫెక్ట్ లు జోడించి తయారుచేసిన కథ ఇది. దీంట్లో పులి క్యారెక్టర్ కూడా కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కాస్త భారీగానే ఖర్చు చేసారు. అందుకే సరైన సీజన్ కోసం వెయిట్ చేసి, దసరా టైమ్ లో వదులుతున్నారు.

ఆర్ఆర్ఆర్ దసరాకు రాదు అని గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా డేట్ ను అక్టోబర్ 8 కి ఫిక్స్ చేయడం విశేషం. అయితే ఇదే డేట్ కు బాలయ్య అఖండ వుంది అని వినిపిస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా తెలియడం లేదు.