కొత్త ప్రయోగంపై జనాల ఆసక్తి

శ్రేయాస్ మీడియా సంస్ధ ఆన్ లైన్ థియేటర్ పేరిట చేసిన ప్రయోగానికి సినిమా అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది. ఆర్జీవీ అడల్ట్ టచ్ సినిమా పుణ్యమో లేదా లాక్ డౌన్ టైమ్ లో…

శ్రేయాస్ మీడియా సంస్ధ ఆన్ లైన్ థియేటర్ పేరిట చేసిన ప్రయోగానికి సినిమా అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది. ఆర్జీవీ అడల్ట్ టచ్ సినిమా పుణ్యమో లేదా లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లు లేకపోవడమో, మొత్తం మీద ఈ ఆన్ లైన్ థియేటర్ కాన్సెప్ట్ కు మాంచి స్పందన వచ్చింది. 50 వేల మంది ఒకేసారి చూస్తే సరిపోయే కెపాసిటీతో సర్వర్ లను శ్రేయస్ మీడియా సిద్దం చేసుకుంది.

కానీ ఒకేసారి ట్రాఫిక్ పెరిగిపోవడంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. దీంతో అప్పటికప్పుడు లక్షా పాతిక వేల కెపాసిటీకి పెంచారు. సినిమా చూసే ఆసక్తిని రెండున్నరలక్షలకు మంది పైగా కనబర్చడంతో మళ్లీ సర్వర్ క్రాష్ అయింది. దాంతో మళ్లీ అప్ డేట్ చేసారు.

ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా శ్రీనివాసరావు మాట్లాడుతూ…'ఇన్నేళ్ల కృషి ఫలించిందని, ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని అన్నారు. రెండు లక్షల డెభై అయిదు వేల మంది క్లయిమాక్స్ సినిమాను తమ ఆన్ లైన్ థియేటర్ లో చూసారని ఇది నిజంగా అద్భుతం అని అన్నారు. ఎన్నో థియేటర్లలో విడుదల చేస్తే తప్ప, ఇంత మంది చూడడం అసాధ్యం అని, అలాంటిది ఒక్క కాన్సెప్ట్ తో ఇంతమంది ఆన్ లైన్ లో చూసేలా చేయడం జరిగిందని అన్నారు. ఈ విజయంతో మరిన్ని వైవిధ్యమైన సినిమాలు అందించబోతున్నామన్నారు. క్లయిమాక్స్ ఆన్ లైన్ థియేటర్ విజయాన్ని మీడియా ముందు సెలబ్రేట్ చేసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. 

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత